27, డిసెంబర్ 2011, మంగళవారం

ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు పెట్టే బైక్



ఈ ఫోటోలో ఉన్న బైక్‌ను గమనించారా..!! ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు తీసే ద్విచక్ర వాహనం. గల్ఫ్ టాప్ ఫ్యూయెల్ డ్రాగ్ రేసింగ్ బైక్‌గా పిలిచే ఈ సూపర్‌బైక్ ప్రస్తుతం ముంబై నగరానికి వచ్చేసింది. ఈ బైక్ కేవలం కేవలం 6 సెకండ్లలోపే 402.8 కి.మీ.వేగాన్ని అందుకుంటుంది. ఫార్ములా వన్ రేస్ కార్ల కన్నా, ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కాన్ ఫైటర్ జెట్ విమానం కన్నా వేగంగా ఇది పరుగులు తీస్తుంది.

ఆరు మీటర్ల పొడవు ఉండే ఈ సూపర్‌బైక్‌లో 1500 హెచ్‌పి శక్తి కలిగిన ఇంజన్‌ను అమర్చారు. ప్యూమా ఇంజనీరింగ్ సంస్థ ఈ బైక్‌ను డిజైన్ చేసింది. ఇది నైట్రో మీథేల్ ఇంధనంతో నడుస్తుంది. ఇందులో అత్యంత అధునాతమైన గల్ఫ్ ప్రైడ్ 4టి ప్లస్ 20డబ్ల్యూ40 ఇంజన్ ఆయిల్‌ను ఉపయోగిస్తారు. మరి ఈ సూపర్‌బైక్‌ను కండబలంతో పాటు కూసింత గుండె ధైర్యం కూడా కావాలి. మీరేమంటారు...?

1 కామెంట్‌:

pls