థానే తుపాను దిశ మారింది. అయినా జిల్లాను భయం వీడడం లేదు. చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న థానే తుపాను దిశ గురువారం సాయంత్రానికి మారింది. కడలూరు-పాండిచ్చేరి వైపుగా పయనిస్తోంది. తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని, జిల్లాలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. థానే ప్రభావంతో జిల్లాలో * కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. అధికారులు పలు చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రజలను అప్రమత్తం చేశారు. జిల్లాలోని పలు నెల్లూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి : రెండు రోజుల కన్నా గురువారం అలల ఉద్ధృతి ఎక్కువయ్యింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. తీరప్రాంతమంతా బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. రాత్రి పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. వాకాడు మండలం తూపిలిపాళెం, కోట మం డలం కొత్తపట్నం, శ్రీనివాససత్రం వద్ద సముద్రం 40-50 మీటర్లు ముందుకు వచ్చింది. వావిళ్లచెరువు, కొత్తపట్నం గ్రామాల్లో 50 ఎకరాల వరినారుమళ్లను సముద్రపు నీరు ముంచెత్తింది. బోగోలు, కావలి మండలాలలో తీరాన ఉంచిన పడవలు, వలలు దెబ్బతిన్నాయి. ఒక్క బోగోలు మండలం తాటిచెట్లపాళెం వద్ద 20 బోట్లు, 30కి పైగా వలలు దెబ్బతినడంతో రూ. 50 లక్షలు నష్టం జరిగి ఉంటుందని అధికారులఅంచనా. కావలి మండలం లక్ష్మీపురం వద్ద బకింగ్‌హాం కెనాల్‌కు గండి పడటంతో 200 ఎకరాల్లో వరి పంటను సముద్రపు నీరు ముంచెత్తింది. చిప్పలేరు క్రీక్ దగ్గర బ్యాక్‌వాటర్ కారణంగా కెనాల్‌కు గండిపడినట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద థానే తుపాను కారణంగా జిల్లాలో రెండు కోట్ల రూపాయల మేర ఆస్తి, పంట నష్టం జరిగి ఉంటుందని సమాచారం. వాకాడు మండలంలో సముద్రతీరాన్ని ఆనుకుని ఉన్న మూడు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ ప్రతిఘటించారు. అలాగే చిల్లకూరు మండలం తూర్పుకనుపూరు, గుమ్మళ్లదిబ్బ గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చేందుకు ప్రజలు అంగీకరించలేదు. చిల్లకూరు వద్ద తమిళనాడుకు చెందిన 20 బోట్లు తీరానికి చేరాయి. కృష్ణపట్నం పోర్టు దగ్గర మూడో నెంబరు ప్రమాదసూచికను ఎగురవేశారు. వణుకుతున్న తీరం కావలి : థానే తుపాన్ కావలి తీరాన్ని వణికిస్తోంది. కావలి మండలంలోని లక్ష్మిపురం మత్స్యకార గ్రామంను ఆనుకొని ఉన్న బకింగ్‌హామ్ కెనాల్‌కు గండి పడడంతో సుమారు 200 ఎకరాల వరి పైరు నీట మునిగింది. సుమారు 40 వలలు, 15 బోట్లు అలల ఉద్ధృతికి దెబ్బతినడంతో సుమారు *30 లక్షల నష్టం వాటిల్లింది. తీరంలోని లక్ష్మీపురం గ్రామ సముద్ర జలాల్లో గురువారం వేకువన ఓ ఫైబర్ బోటులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు గల్లంతయ్యారని సమాచారం. వారిని ప్రకాశం జిల్లాకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి కృష్ణపట్నం పోర్టు అధికారులకు స్థానిక పోలీసులు సమాచారం అందించారు. గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చేపట్టారు. కావలి మండల తుపాన్ ప్రత్యేకాధికారులు, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ క్రిష్ణకిషోర్‌రెడ్డి మండలంలోని తీరప్రాంతంలో పర్యటిస్తూ, మత్స్యకారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. ప్రతి గ్రామానికి ఓ వీఆర్వోని, ఓ పోలీసు కానిస్టేబుల్‌ను ఉంచి పర్యవేక్షిస్తున్నారు. బ్యాక్ వాటర్‌తో తెగిన బకింగ్ హాం కెనాల్ సముద్రం నుంచి వస్తున్న బ్యాక్ వాటర్‌తో మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో బకింగ్‌హాం కెనాల్‌కు గండి పడింది. బకింగ్‌హామ్ కెనాల్‌లోని ఉప్పు నీరంతా పంట పొలాల్లోకి చేరింది. సుమారు 200 ఎకరాల వరి పొలాలు బకింగ్‌హామ్ కెనాల్ నుంచి వచ్చిన నీటితో మునిగాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. కావలి డివిజన్‌లోని తీరప్రాంత మండలాలైన కావలి, అల్లూరు, బోగోలు, విడవలూరు తదితర మండలాల్లో పరిస్థితిని కావలి ఆర్డీవో మద్దా వెంకటేశ్వర్లు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. 80మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం బిట్రగుంట : ‘థానే’ తుపాన్ తూర్పుతీరాన్ని అల్లకల్లోలం చేసింది. ఉవ్వెత్తున్న ఎగసిపడుతున్న అలలు, భారీ ఈదురుగాలులతో కడలి ఉగ్రరూపం దాల్చింది. సునామీని గుర్తుచేసేలా తీరాన్ని కబలిస్తూ ముందుకు చొచ్చుకువస్తొంది. తాటిచెట్లపాళెం తీరం వద్ద గురువారం వేకువ నుంచి పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. 6 నుంచి 10మీటర్ల ఎత్తులో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. సుమారు 80మీటర్లు సముద్రం ముందుకు చొచ్చుకువచ్చింది. సునామీని సైతం తట్టుకొని నిలదొక్కుకున్న సముద్రపు ఒడ్డు థానే తాకిడికి నామరూపాల్లేకుండా పోయింది. కట్టపై ఉన్న తాటిచెట్లు కూడా అలల ఉధృతికి నేలకు వాలి సముద్రంలో కలసిపోయాయి. తీరానికి 100మీటర్లకు పైగా దూరంలో ఉన్న ఫిష్‌ల్యాండిగ్ సెంటర్‌ను సముద్రపు నీరు ముంచెత్తింది. స్థానిక మత్స్యకారులు కరిపెంగారి రమణయ్య, వాయిల తాతాయ్య, మేకల గోవిందు, వాయిల గోపాల్, తులసి బాబు, తులసి నరసింహులు, ప్రళయకావేరి శ్రీనివాసులు, వాయిల చెంచయ్య, తదితరులకు చెందిన 50 ఫైబర్ పడవలు, 50వలలు అలల తీవ్రత కారణంగా దెబ్బతిన్నాయి. వీటి విలువ సుమారు రూ. 50లక్షలు ఉంటుందని స్థానికుడు ప్రళయకావేరి శ్రీనివాసులు తెలిపారు. మరో 50కిపైగా డిస్కో వలలు ఇసుకలో కూరుకుపోయాయి. వలలు, పడవ లు కాపాడుకునేందుకు నానాఅవస్థలు పడుతున్నారు. ఇసుకలో కూరుకుపోయిన వలలను అతికష్టం మీద తీరానికి దూరంగా తరలిస్తున్నా రు. గురువారం వేకువన ఒక మోస్తరుగా ఉన్న అలలు ఆరు గంటల ప్రాంతంలో ఉవ్వెతున్న ఎగసి పడ్డాయి. ఆరు నుంచి 10మీటర్ల ఎత్తులో అలలు తీరాన్ని కబలిస్తూ 11 గంలవరకూ ఆందోళన కలిగించాయి. 11 నుంచి 12వరకూ కొద్దిగా శాంతించిన సముద్రుడు 12.30 ప్రాం తంలో మరోసారి విజృంభించాడు. సాయంత్రం వరకూ అలల ఉధృతి తగ్గే అవకాశం కని పించకపోవడంతో మత్స్యకారులు దేవుడిపై భారం వేసి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. అధికారుల అప్రమత్తం థానే ప్రభావంతో తీరంలో పరిస్థితులు తారుమారు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్ సహాయక చర్యల ప్రత్యేకాధికారి, గృహనిర్మాణశాఖ పీడీ వెంకటేశ్వరరెడ్డి, బిట్రగుంట ఎస్సై ఖాజావలి, రెవెన్యూ, ఇంజనీరింగ్ సిబ్బంంది తీరంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. తీరంలోని మత్స్యకార గ్రామాల్లో పోలీసు, రెవెన్యూ సిబ్బందిని కాపలాగా ఉంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. | ||
| | ||
| |
మనల్ని పుట్టించిన ఆ సృష్టి కర్తకి నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను, నాకు ఇంత మంచి జీవితాన్ని ప్రశాదిన్చినందుకు నా ఈ జన్మంతా రుణపడి ఉంటాను.
30, డిసెంబర్ 2011, శుక్రవారం
దిశ మారిన ‘థానే’
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls