మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘మగాడు’ అనే టైటిల్ తో సినిమా వస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సినిమాను సి.కళ్యాన్, సింగనమల రమేష్ మణిశర్మ సంగీత దర్శకత్వంలో నిర్మించబోతున్నట్లు అంతా చర్చించుకున్నారు. ఖలేజా భారీ ప్లాపు కావడం... సి.కళ్యాన్, సింగనమల వివిధ పోలీసు కేసుల్లో ఇరుక్కోవడంతో ఈ సినిమా అటకెక్కింది. మహేష్ బాబు, త్రివిక్రమ్ ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం మహేష్ బిజినెస్ మ్యాన్, ఆతర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో బిజి షెడ్యూల్ తో ఉంటే, త్రివిక్రమ్ శ్రీనివాస్
అల్లు అర్జున్-ఇలియాన జంటగా ఓ సినిమాను రూపొందిస్తున్నారు.
అప్పుడెప్పుడో కరుమరుగైన మహేష్ బాబు ‘మగాడు’ తాజాగా నెట్లో హల్ చల్ చేస్తోంది. 2012లో ఆ సినిమా విడుదల కాబోతోందంటూ ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే దీనిపై మహేష్, త్రివిక్రమ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అభిమానులే కావాలని మహేష్ బాబు ‘మగాడు’ను లైమ్ లైట్లోకి తెస్తున్నారని అనుమానిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls