28, డిసెంబర్ 2011, బుధవారం

ప్రపంచ శాంతికి భారతీయుల ప్రార్థనలు

జెరూసలేం/బెత్లహామ్: క్రిస్టమస్ పర్వదినం సందర్భంగా క్రీస్తు జన్మ స్థలమైన బెత్లహామ్‌కు వందలాదిగా భారతీయ క్రై స్తవ సోదరులు తరలివెళ్లి ప్రపంచశాంతిని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ వీరికి సారథ్యం వహించిన కేరళవాసి ఫాదర్ స్లీబా కాట్పుమన్ గప్పు మాట్లాడుతూ కొంతకాలంగా ఇబ్బందులకు గురవుతున్న క్రై స్తవులకు శాంతి చేకూరాలని కోరుతూ ఈ చారిత్రక పట్టణంలో ప్రార్థనలు చేసేందుకు అంతా కలిసి వచ్చామన్నారు. ఈ యాత్రికులను భారత్ నుంచి బెత్లహామ్ తీసుకువచ్చేందుకు సహాయపడిన యాత్రా సంస్థ స్కోపస్ వరల్డ్ ప్రతినిధి జోసీలిబా మాట్లాడుతూ వీరి పర్యటనకు మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ యాత్ర విషయం తెలిసిన వెంటనే చాలా మంది ఉత్సాహంగా తమను సంప్రదించారని పేర్కొన్నారు. కేరళవాసి అబ్రహామ్ మాట్లాడుతూ తాను మొదటిసారిగా ఇక్కడికి వచ్చాననీ, ఓ మంచి ఉద్దేశంతో చేస్తున్న యాత్రలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందనీ తెలిపారు.

అలాగే తమిళనాడు, కేరళల నుంచి వచ్చిన యాత్రికులు ప్రత్యేకంగా సమావేశమై ప్రార్థన చేయడం అందరి దష్టిని ఆకర్షించింది. ముల్లపెరియార్ డ్యామ్ వివాదంతో ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారని వార్తలు వెలువడ్డాయి. ఇది భారత ఐకమత్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదముందని కొట్టాయం నుంచి వచ్చిన షహీం కురువిల్లా అన్నారు. ఈ డ్యాం ద్వారా దక్షిణ భారతదేశంలో ఉద్రిక్తతలు నెలకొనే ప్రమాదం పొంచి ఉందనీ, ఇరు రాష్ట్రాల నేత లు వ్యక్తిగత ప్రయోజనాలు కాంక్షించకుండా దేశానికి మేలు చేసేలా సమస్యను పరిష్కరిస్తే బాగుంటుందని చెన్నై వాసి ముత్తుస్వామి ఆకాంక్షించారు.

ఈ ఒక్క సమస్య మాత్రమే కాకుండా దేశానికి అంతా మంచే జరగాలని కోరుతూ సుమారు 500కు పైగా వచ్చిన యాత్రికులంతా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా, బెత్లహామ్‌కు క్రిస్టమస్ వేడుకల నిమిత్తం ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారు మొత్తంగా లక్షా ఇరవై వేల వరకు ఉన్నారని, ఇది గత ఏడాది కంటే 30 శాతం అధికమని పాలస్తీనా అధికారులు వెల్లడించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls