30, డిసెంబర్ 2011, శుక్రవారం

హౌసింగ్ అధికారిపై దాడి

మొనపాళెం(వాకాడు): తుపానులో ప్రజలను అప్రమత్తం చేసిసురక్షిత ప్రాంతాలకు తరలించే నిమిత్తం మొనపాళెం గ్రామానికి వెళ్లిన హౌసింగ్ ఏఈ పుల్లయ్యపై ఆ గ్రామానికి చెందిన మామిడిపూడి శ్రీనివాసులు స్కూటర్ ఆపలేదని మద్యం మత్తులో దాడి చేసి గాయపరిచారు. ఈ విషయం వాకాడు అధికారులకు తెలిపినా ఫలితం లేకపోవడంతో ఆయా గ్రామాల్లోని సైక్లోన్ అధికారులు తాము డ్యూటీలు చేయలేమంటూ నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు తీర ప్రాంతాల్లో భద్రతలేదని డ్యూటీలు చేయలేమంటూ ఐటీడీఏ పీఓ వెంకటేశ్వరరావు, డిప్యూటీ తహశీల్దార్ పూర్ణచంద్రరావుకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఈ విషయాన్ని విలేకరులకు తెలుపగా వారు అధికారులను వివరణ కోరారు. స్పందించిన అధికారులు మొనపాళెం గ్రామానికి వెళ్లి స్పెషల్ అధికారులకు ధైర్యం చెప్పి అతనిపై వె ంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శ్రీనివాసులుపై కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls