
నేను నచ్చ లేదనటం ఎంత వరకు సబబు? నిజా నిజాలు తెలుసుకోకుండా అలా ఇష్టమొచ్చినట్లు పుకార్లు పుట్టించడం ఎంత దారుణం అంటోంది పంజాబీ బ్యూటీ చార్మి. అయినా నా గురించి రూమర్స్ విని బాధ పడే స్థాయిలో నేను లేను, హాయిగా నవ్వుకునేంత మానసిక పరిపక్వత వచ్చింది అంటోంది.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే....చార్మి బుడ్డా హోగా తెరా బాప్ తర్వాత ‘జిల్లా గజియాబాద్’ అనే మరో బాలీవుడ్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. సినిమా స్టార్లపై పుకార్లు కామనే కాబట్టి...చార్మి గురించి కూడా బాలీవుడ్ లో ఓ పుకారు లేచింది. ‘జిల్లా గజియాబాద్’ సినిమాలో హీరోగా నటిస్తున్న వివేక్ ఒబెరాయ్ కి చార్మి నచ్చ లేదని, బాగా లావెక్కి బోండాంలా ఉన్న ఆమెను సినిమా నుంచి తప్పించాడని పుకార్ల సారాంశం.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగులో పాల్గొంటున్న చార్మి షూటింగు స్పాట్ లో తనపై వస్తున్న రూమర్ల గురించి వివేక్ ఒబెరాయ్ కి చెప్పి తెగ ఎంజాయ్ చేస్తోందట. ఏ బాషలో అవకాశం వస్తే అక్కడ నటించడానికి సంతకాలు చేస్తున్న ఛార్మి...తాను ఈ స్థాయికి రావడానికి కారణం అయిన తెలుగు సినిమా పరిశ్రమను ఎప్పటికీ మరిచిపోనంటోంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls