నాగ్ సరసన నయనతార

నయనతార నటజీవితంపై ఇప్పటివరకూ జరిగిన చర్చకు తెరపడింది. నాగార్జున సరసన ఆమె ఓ చిత్రంలో నటించనున్నారని తెలిసింది. నాగార్జునతో ‘సంతోషం’ లాంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన దశరథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, నాగ్‌తో పలు చిత్రాలు నిర్మించిన ‘కామాక్షి మూవీస్’ అధినేత డి.శివప్రసాదరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా కోసం పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించినా, పాత్ర పరంగా నయనతార పేరునే నాగార్జున సూచించారని సమాచారం.

నాగ్ సరసన ‘బాస్’ చిత్రంలో నయనతార నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న రెండవ సినిమా ఇదే అవుతుంది. మే నెలలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది. ప్రభుదేవాతో వివాహానంతరం సినిమాలకు దూరంగా ఉండాలని నయనతార నిర్ణయించుకున్నట్లు గతంలో పలు వార్తలొచ్చాయి. ఇటీవల జరిగిన ‘శ్రీరామరాజ్యం’ యాభై రోజుల వేడుకలో కూడా ఆమె నటజీవితంపై ఒకరిద్దరు ప్రముఖులు నయనతార నటిగా కొనసాగే విషయంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 

‘శ్రీరామరాజ్యం’లో ‘సీత’గా నటించి అందరి హృదయాలలో నిలిచిపోయిన నయనతార... తర్వాత ఎలాంటి సినిమా చేస్తే బావుంటుందో నిర్ణయించుకోవడంలో కాస్త తర్జనభర్జన పడినట్లు తెలిసింది. ఫైనల్‌గా నాగ్ సరసన తాజా చిత్రంలో చేయడానికి ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో నయనతార మనోభిప్రాయం తెలిసింది. నయనతార పారితోషికం విషయంలో కూడా కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఆమె అత్యధికంగా కోటిన్నర వరకు డిమాండ్ చేస్తున్నట్లు కూడా ప్రచారంలో ఉంది. నాగ్ సరసన ఆమె తీసుకుంటున్న పారితోషికం విషయం మాత్రం రహస్యంగా ఉంచారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls