
నెల్లూరు: గత ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ తరపున నెల్లూరు జిల్లా కోవూరు నుంచి పోటీ చేసిన తుపాకుల మునెమ్మ బుధవారంనాడు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. గతంలో చిరంజీవి అంటే అభిమానంతో ఆమె అప్పట్లో ప్రజా రాజ్యం పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తొలి మహిళా అభ్యర్థి మునెమ్మ. ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను ఖరారు చేసే క్రమంలో చిరంజీవి అందరికన్నా ముందు మునెమ్మ పేరును ఖరారు చేశారు. దాంతో ఆమె పేరు వెలుగులోకి వచ్చింది.
కోవూరు మాజీ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో ఆమె బుధవారంనాడు వైయస్సార్ కాంగ్రెసులో చేరారు. డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలే తనను జగన్ వైపు నడిపించాయని మునెమ్మ చెప్పారు. తనకు వైయస్సార్ కాంగ్రెసులో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆమె చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls