
వైదిస్ కొలెవైరిడి.. అంటూ ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన యువ నటుడు ధనుష్ మరో సంచలనానికి నాంది పలికారు. కోలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఈ యువ హీరో ఇప్పుడు బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఈయన బాలీవుడ్ రంగ ప్రవేశం ఖరారయింది. తనూ వెడ్స్ మను చిత్రంతో బాలీవుడ్‌లో హిట్ కొట్టిన దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ రూపొందిస్తున్న తాజా చిత్రంలో ధనుష్ హీరోగా నటించనున్నారు.
ఈ చిత్రానికి రాజ్‌హ్నా అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ విషయం గురించి దర్శకుడు ఆనంద్ వెల్లడిస్తూ ఈ చిత్రం కోసం గత ఆరు నెలలుగా సింపుల్ బాయ్ కోసం అన్వేషిస్తున్నారన్నారు. ఎప్పుడయితే తమిళ చిత్రం ఆడుగళంలో ధనుష్ నటనను చూశానో అప్పుడే ఈయన తన చిత్ర హీరో అని ఫిక్స్ అయిపోయానన్నారు. నటుడు ధనుష్ మాట్లాడుతూ తనకు హిందీ భాష తెలియదన్నారు.
అందువల్ల ముందుగా అక్కడి ఆచార వ్యవహారాలను తెలుసుకుంటున్నానని తెలిపారు. హిందీ భాష నేర్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నానని అన్నారు. రాజ్‌హ్నా చిత్రం తను వెడ్స్ మను చిత్రం తరహాలోనే విభిన్న ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని, చిత్ర షూటింగ్‌ను ఢిల్లీ, పంజాబ్, చెన్నై తదితర ప్రాంతాల్లో చేయనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. ప్రస్తుతం 3చిత్రంలో నటిస్తున్న ధనుష్ తదుపరి బాలీవుడ్ చిత్రాన్నే చేయనున్నట్లు సమాచారం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls