న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర రాజకీయాల వేడి రాజుకుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన రాత్రి గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయి పలు విషయాలు చర్చించారు. గురువారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా పలువురితో సమావేశమవుతారు. సిఎం పర్యటనతో ఢిల్లీలో రాష్ట్ర రాజకీయాల వేడి రాజుకుంది. ఇటీవల మద్యం సిండికేట్లపై జరిగిన దాడిపై ఆయన అధిష్టానంతో చర్చించే అవకాశముంది. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను టార్గెట్ చేసుకొనే సిఎం సిండికేట్లపై దాడులు జరిగినట్లు పుకార్లు వినిపించిన విషయం తెలిసిందే. అలాగే తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వర్గం ఎమ్మెల్యేలకు కేటాయించవలసిన మంత్రి పదవులపై, తెలంగాణలోని ఉప ఎన్నికలపై సిఎం అగ్రనేతలతో చర్చిస్తున్నారు.
కాగా సిఎం కిరణ్‌తో రాష్ట్రానికి చెందిన పలువురు పార్లమెంటు సభ్యులు భేటీ అయ్యారు. నిత్యం ఆయనపై విరుచుకు పడే తెలంగాణ ఎంపీలు కూడా కలిసిన వారిలో ఉన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, మందా జగన్నాథం, అంజన్ కుమార్ యాదవ్, బలరాం నాయక్, రాజయ్య, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, కనుమూరి బాపిరాజు ఆయనను కలిశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls