
మీ బిజీ షెడ్యూల్స్ కారణంగా టెలివిజన్ కార్యక్రమాలను వీక్షించలేకపోతున్నారా..? ట్రాఫిక్ రద్దీలో చిక్కుకుని మీకు ఇష్టమైన రియాల్టీ షోలు, టీవీ సీరియళ్లు మిస్ అవుతున్నారా..? అయితే, చింతించకండి.. ఇకపై మీ కారునే లివింగ్ రూమ్‌గా మార్చేద్దాం. అదెలా అనుకుంటున్నారా..! చాలా సింపుల్. ఈ కథనం చదవండి.
ట్రావెలింగ్ కారణంగా ముఖ్యమైన టెలివిజన్ ఛానెళ్లు మిస్ అవుతున్న వారి కోసం ముంబైకు చెందిన అవనిటివీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఓ సరికొత్త కార్ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థను పరిచయం చేసింది. ఒకప్పుడు యాంటెన్నా ద్వారా దూరదర్శన్ ఛానెళ్లను వీక్షించే వాళ్లం గుర్తుందా, ఆ తర్వాతి కాలంలో కేబుల్ టెలివిజన్లు రావడంతో ఈ యాంటెన్నాలను కాస్తా పాత ఇనుప సామాన్ల వాళ్లకు వేసేశాం అనుకోండి.
అయితే.. ఇప్పుడు 'ఓల్డో ఈజ్ గోల్డ్' అని ఆంగ్లంలో అన్న సామెత అక్షరాల నిజమైంది. పట్టణాలు, నగరాలు చివరకు మారుమూల పల్లెల్లో సైతం ప్రతి ఇంటిపై చిప్ప (డిష్) టివీలు వెలుస్తున్నాయి. ఇదే కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని అవనిటివి ఓ సరికొత్త కమ్యూనికేషన్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆవిష్కరించింది. కారులోపలి భాగంలో ఓ చిన్న సెటాప్ బాక్సును అమర్చుకోవడం ద్వారా కారులోపల అమర్చిన ఎల్‌సిడి స్క్రీన్‌పై లైవ్ టివీని వీక్షించవచ్చు.
అవనిటివీ కార్-సెటాప్ బాక్స్ గురించి మరింత సమాచారం కోసం నెక్స్ట్ (badri) పై క్లిక్ చేయండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls