గుగూల్ కోసం ఇంకెన్నాళ్లు ఎదరుచూపులు..?


Google nexus branded tablet coming on its way!!

ఎట్టకేలకు ఆండ్రాయిడ్ ఆధారిత ‘గుగూల్ నెక్సస్’ టాబ్లెట్ పీసీ విడుదలకు ముహుర్తం ఖారారయ్యింది. జూన్‌లో విడుదల కానున్న ఈ మోస్ట్‌వాంటెడ్ డివైజ్ మార్కెట్ అంచనాలను రెట్టింపు చేస్తుంది. విడుదలకు ఇంకా ఐదు నెలల సమయం ఉన్నప్పటికి వెయిట్ చేస్తామంటూ గుగూల్ ఫ్యాన్స్ ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. గుగూల్ ఆండ్రాయిడ్ లేటెస్ట్ ‘ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్’ఆపరేటింగ్ సిస్టం పై ఈ టాబ్లెట్ రన్ అవుతుంది. బటన్ వ్యవస్థ లేకుండా పూర్తి స్ధాయి స్వైప్ విధానంతో ఈ డివైజ్ పనిచేస్తుంది. యూజర్ ఫ్రెండ్లీ లక్షణాలను ఒదిగి ఉన్న ఈ ఆపరేటింగ్ సిస్టం మెరుగైన సెక్యూరిటీ ఫీచర్లతో ఉత్తమ పనితీరు కనబరుస్తుందని విశ్లేషక వర్గాలు భావిస్తున్నాయి. పటిష్టమైన క్వాడ్ కోర్ ప్రాసెసింగ్ వ్యవస్థ పై డివైజ్‌ పనిచేస్తుంది. గుగూల్ నెక్సస్ ధర ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls