29, డిసెంబర్ 2011, గురువారం

లాలూని ‘జాతీయ వ్యక్తి’గా ప్రకటించాలి: శతృఘ్న

న్యూఢిల్లీ: జాతీయ పక్షి నెమలి వలే... ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను కూడా ‘జాతీయ వ్యక్తి’గా ప్రకటించాలని బీజేపీ ఎంపీ, సినీనటుడు, షాట్‌గన్ శతృఘ్నసిన్హా లోకసభలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. జీరో అవర్ సందర్బంగా రాజ్యంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో భోజ్‌పురి భాషను చేర్చాలని సిన్హా డిమాండ్ చేశారు. భోజ్‌పురి భాషను లాలూ ప్రసాద్ యాదవ్‌తోపాటు... రాజేంద్ర ప్రసాద్, జయప్రకాశ్ నారాయణ్, బాబు జగ్జీవన్‌రామ్, మారిషస్ జాతిపిత సర్ సీవూసాగర్ రామ్‌గూలమ్ లాంటి ప్రముఖులు మాట్లాడేవారని తన ప్రసంగంలో తెలిపారు.

దేశ, విదేశాల్లో లాలూకు విశేష గుర్తింపు ఉందని.. పాకిస్థాన్‌లో లాలూ ప్రసాద్‌కు పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఉన్నారని అన్నారు. రాజ్యాంగంలో భోజ్‌పురిని చేర్చడం.. లాలూని జాతీయ వ్యక్తిగా ఎంపిక చేయడం ఒకేసారి జరుగాలని సిన్హా అనగానే సభలో పెద్ద పెట్టున నవ్వులు విరిసాయి. సభ్యులు బల్లలపై కొడుతూ.. హర్షం ప్రకటించారు. ప్రధాని మన్మోహన్, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ పెద్ద పెట్టున నవ్వుతూ కనిపించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls