29, డిసెంబర్ 2011, గురువారం

తెలంగాణలో చంద్రబాబుకు లేనిది జగన్‌కా?: మేకపాటి

హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించగా తమ అధినేత, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందేమిటని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గురువారం అన్నారు. గుంటూరులో యాత్ర
Mekapati Rajamohan Reddy
పూర్తి కాగానే తెలంగాణలో త్వరలో జగన్ ఓదార్పు యాత్ర చేపట్టనున్నారన్నారు. జగన్ పర్యటన కోసం తెలంగాణ ప్రజలు ఆతృతతో ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో తెలంగాణలో మాకు మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, టిడిపిలకు దిమ్మ తిరిగేలా ఫలితాలు ఉంటాయన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ తొలగించి రాజీవ్ యువకిరణాలు పెట్టారన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందన్నారు. డిసెంబర్ నెలాఖరులోగా లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న సిఎం ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ పథకానికి సంబంధించి మూడువేల కోట్ల బకాయిలు ఉంటే కేవలం ఐదువందల కోట్లే ఇచ్చారన్నారు. జనవరి నాలుగో తేదిన ఒంగోలులో ఫీజు పోరు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టరును వారు విడుదల చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls