27, డిసెంబర్ 2011, మంగళవారం

లంచం ఇవ్వకండి: ఏ తప్పుకు ఎంత ఫైన్ కట్టాలో తెలుసుకోండి


నగరరోడ్లపై ట్రాఫిక్ పోలీసులు నిత్యంత శ్రమిస్తూ రోడ్డు భద్రత, రద్దీ సమస్యలను నివారించేందుకు కృషి చేస్తుంటారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే, వారు జరిమానా కట్టకు తప్పుదు. ప్రముఖులైనా, సామాన్యులైనా చట్టం ముందు అందరూ సమానమే. మరి ఏ తప్పుకు ఎంత జరిమానా కట్టాలో తెలుకోవటం మంచిది. ఊరికే పోలీసులకు లంచాలు ఇచ్చి తప్పించుకోవటం బదులు, జరిమానాను కట్టడమే ఉత్తమం.

ఎందుకంటే మీరు సమర్పించే ముడుపులకు, కట్టే జరిమానాలకు పెద్దగా వ్యత్యాసం ఉండదు. ఒక్కోసారి జరిమానా కన్నా అధికారులకు మీరు చెల్లించే ముడుపులే అధికంగా ఉంటాయి. కాబట్టి లంచాలను ఇచ్చి అవినీతిని ప్రోత్సహించే బదులు జరిమానా కట్టి నిజాయితీ గల భారతీయుడు అనిపించుకోవడం ఎంతో ఉత్తతమం. మీరు కట్టే జరిమానా నేరుగా ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది. అదే లంచం ఇచ్చినట్లైతే అవినీతి అధికారుల బొజ్జలోకి వెళ్తుంది.

కాబట్టి, ఏ తప్పిదానికి ఎంత జరిమానో కట్టాలో అనే వివరాలను మా తెలుగు డ్రైవ్ స్పార్క్ పాఠకుల కోసం ప్రత్యేకంగా బెంగుళూరు పోలీసుల సహకారంతో సమాచారాన్ని సేకరించి ప్రచురించడమైనది.

- సరైన చెల్లుబాటు కాని లైసెన్స్‌తో డ్రైవింగ్ చేయడం - రూ.300/- (అన్ని వాహనాలకు)
- డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఓ వ్యక్తిని డ్రైవింగ్ చేయడానికి అనుమంతిచడం - రూ.300/- (అన్ని వాహనాలకు)
- లైసెన్స్, ఇతర పత్రాలు లేకుండా డ్రైవింగ్ చేయడం - రూ.100/- (అన్ని వాహనాలకు)
- ద్విచక్ర వాహనంపై ఇద్దరి కన్నా (రైడర్‌తో కలిపి) ఎక్కువ మంది ప్రయాణించడం - రూ.100/- (ద్విచక్ర వాహనాలకు)
- ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించటం - రూ.100/- (అన్ని వాహనాలకు)
- నోపార్కింగ్ జోన్/ఏరియాలో వాహనాన్ని పార్క్ చేయడం - రూ.100/- (అన్ని వాహనాలకు)
- ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఉల్లంఘించి, రాంగ్ సైడ్‌ను ఉపయోగించడం - రూ.100/- (అన్ని వాహనాలకు)
- లైన్ దాటటం, పెద్ద శబ్ధాన్నిచ్చే హారన్లను ఉపయోగించటం, నో-ఎంట్రీ జోన్‌లోకి వాహనాన్ని తీసుకువెళ్లటం - రూ.100/- (అన్ని వాహనాలకు)
- మ్యూజికల్ హారన్‌ను ఉఫయోగిస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేయటం - రూ.500/- (అన్ని వాహనాలకు)
- డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించటం - రూ.100/- (అన్ని వాహనాలకు)
- ఒక్క చేతితో ర్యాష్ డ్రైవింగ్ చేయడం - రూ.500/- (అన్ని వాహనాలకు)
- పోలీసు అధికారి సూచనలను ఉల్లంఘిచడం - రూ.200/- (అన్ని వాహనాలకు)
- పోలీసు అధికారికి నకిలీ సమాచారం ఇవ్వటం - రూ.200/- (అన్ని వాహనాలకు)
- మీటరు విలువ కన్నా అధికంగా వసూలు చేయటం - రూ.50/- (ఆటో రిక్షాలు)
- లెర్నర్ లైసెన్సు కలిగి ఎల్ బోర్డును ఉపయోగించకపోవటం - రూ.100/- (అన్ని వాహనాలకు)
- హెల్మెట్ లేకుండా బైక్ నడపటం - రూ.100/- (ద్విచక్ర వాహనాలకు)
- నిర్లక్ష్యంగా బైక్‌ను వెనక్కు తిప్పడం (రివర్స్ చేయడం) - రూ.100/- (అన్ని వాహనాలకు)
- సేఫ్టీ బెల్ట్‌ను ఉపయోగించకపోవడం - రూ.100/- (కార్లు/జీపులు)
- సైలెన్స్ జోన్‌లో హారన్ ఉపయోగించడం - రూ.100/- (అన్ని వాహనాలకు)
- డార్క్ టింటెడ్ గ్లాస్ కలిగి ఉన్న వాహనాలు - రూ.100/- (అన్ని వాహనాలకు)
- సరైన నెంబర్ ప్లేట్ ఉపయోగించకపోవడం - రూ.100/- (అన్ని వాహనాలకు)
- నిర్దేశిత వేగం కన్నా అధిక వేగంతో వాహనాలను నడపటం - రూ.200/- (అన్ని వాహనాలకు)
- మానసికంగా, శారీరకంగా సమర్థులు కాని వ్యక్తులు డ్రైవ్ చేయటం - రూ.100/- (అన్ని వాహనాలకు)
- అనుమతి లేకుండా రేసింగ్ చేయటం - రూ.300/- (అన్ని వాహనాలకు)
- మద్యం సేవించి వాహనం నడపటం - రూ.2,000/- (అన్ని వాహనాలకు)
- హెడ్‌లైట్ లేని వాహనాలను నడపటం - రూ.100/- (అన్ని వాహనాలకు)
- వన్-వేలో డ్రైవ్ చేయటం - రూ.100/- (అన్ని వాహనాలకు)
- ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే హ్యాండ్ సిగ్నల్స్‌ను అతిక్రమించటం - రూ.100/- (అన్ని వాహనాలకు)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls