30, డిసెంబర్ 2011, శుక్రవారం

వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళన

దగదర్తి, న్యూస్‌లైన్: ప్రభుత్వ భూములను స్థానికేతరులకు పంచరాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం దగదర్తి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గున్నంరెడ్డి హరికిషోర్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలోని యలమంచిపాడు గ్రామంలోని సర్వే నంబర్ 49 పరిధిలో ఉన్న 1500 ఎకరాలు స్థానికులకేపంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల రెవిన్యూ అధికారులు పంచాయతీ పరిధిలో నిర్వహించిన రెవిన్యూ సదస్సులో బుచ్చిరెడ్డిపాళెం మండలానికి చెందిన కొందరు ఆ భూములు తమకే పంచాలని కోరడం తగదన్నారు.

మండలంలోని తిరువీధిపాడు, తురిమెర్ల గ్రామాలకు చెందిన భూమిలేని అర్హులైన నిరుపేదలకు ఈ సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూములను పంచాలన్నారు. స్థానికులను కాదని స్థానికేతరులకు భూములను కేటాయించరాదని ఆయన అధికారులను కోరారు. డెప్యూటీ తహశీల్దార్ లీలా సంజీవకుమారికి వినతి పత్రాన్ని అందించారు. దీనిపై స్పందించిన ఆమె మండలంలోని ప్రభుత్వ భూములను తొలుత స్థానికులకే పంచుతామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, తిరువీధిపాడు, తురిమెర్ల గ్రామాలకు చెందిన పేదలు పాల్గొన్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls