29, డిసెంబర్ 2011, గురువారం

మరోసారి నాటkaమా?: కెసిఆర్‌పై జగన్ పార్టీ నేతల ఫైర్

Gone Prakash Rao

హైదరాబాద్/విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు గురువారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. కెసిఆర్ దీక్ష పేరుతో మరోసారి నాటకానికి తెరదీశారని గోనె ప్రకాశ రావు ధ్వజమెత్తారు. సెంటిమెంటును అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధి కోసం యువత, విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆఢుకోవద్దని హితవు పలికారు. 2009 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 10 వరకు ఆసుపత్రుల్లో కెసిఆర్ చేయించుకున్న ట్రీట్‌మెంట్ వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు. వాటిని మూడు రోజుల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతానన్నారు. టిఆర్ఎస్ బలోపేతమైనంత మాత్రాన తెలంగాణ రాదని జాతీయ పార్టీలతోనే అది సాధ్యమన్నారు.

కెసిఆర్ దీక్ష పేరుతో మరోసారి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవాలని చూస్తున్నారని మాజీ మంత్రి మారెప్ప విశాఖపట్నంలో అన్నారు. ఉద్యమం పేరుతో విద్యార్థులను బలి చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో వైయస్ రాజశేఖర రెడ్డి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఉద్యమం పేరుతో కెసిఆర్, ఫీజు రీయింబర్సుమెంట్సు ఇవ్వక ప్రభుత్వం విద్యార్థుల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls