ఈ న్యూఇయర్ ను హీరోయిన్ హన్సిక తన పిల్లతోనే జరుపుకోనుంది. ఇంతకీ హన్సిక పెళ్లెప్పుడు చేసుకుంది? పిల్లలను ఎప్పుడు కనిందని అనుకుంటున్నారా?....
తన 20వ పుట్టినరోజు సందర్భంగా హన్సిక ఈ సంవత్సరం ఆగస్టులో 20మంది అనాద పిల్లలను దత్తత తీసుకుంది. ఆ పిల్లల చదువు, ఆహారానికయ్యే ఖర్చుని తనే భరించాలని నిర్ణయించుకుంది. వీలు కుదిరినప్పుడల్లా వారిని కలుస్తుంది కూడా. న్యూఇయర్ వేడుకలను తన పిల్లలతోనే జరుపుకోవాలని నిర్ణయించుకుంది.
తమిళ చిత్రం ‘ఒకెఒకె’ షూటింగ్‌లో 10 రోజులు పాల్గొని ఇటీవలే జోర్డాన్ నుంచి ముంబయ్ చేరుకున్న హన్సిక న్యూ ఇయర్‌ని అక్కడే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. న్యూఇయర్ వేడుక స్నేహితులతో కలిసి చేసుకుంటే ఆ ఆనందం తనకు, తన స్నేహితులకు మాత్రమే పరిమితమవుతుంది. అదే తను దత్తత తీసుకున్న 20 మంది పిల్లలతో కలిసి చేసుకుంటే… వారి కళ్లల్లో కనిపించే ఆనందాన్ని దేనితోనూ వెలకట్టలేం అని అంటోంది. కొత్త సంవత్సరం రోజె తన పిల్లలందరినీ‘రోడ్ ట్రిప్’ తీసుకెళ్లాలనుకుంటుందట కూడా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls