31, డిసెంబర్ 2011, శనివారం

అలా ఉంటే అబ్బాయిలు రెచ్చిపోతారు: నన్నపనేని

Nannapaneni Rajakumari
Ads by Google
Platinum Love Bands
Celebrate Your True Love with Platinum Love Bands!
PreciousPlatinum.in/Love-Bands
గుంటూరు: అమ్మాయిల వస్త్రధారణపై పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) దినేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యను తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ నన్నపనేని రాజకుమారి సమర్థించారు. అమ్మాయిలు అవయవాలకు తగిన వస్త్రాలను ధరించాలని, ఆలా కుకుంటే అబ్బాయిలు రెచ్చిపోతారని ఆమె శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. డిజిపి దినేష్ రెడ్డి అలాంటి ప్రకటన చేయడం సమంజమేనని ఆమె అభిప్రాయపడ్డారు. డిజిపి ప్రకటనలో ఏ విధమైన తప్పు లేదని, వస్త్రధారణపై అందరూ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

అమ్మాయిల వస్త్రధారణ అభ్యంతకరంగా ఉంటోందని ఆమె అన్నారు. అమెరికాలో మన సంప్రదాయాన్ని గౌరవిస్తూ చీరలు ధరిస్తుంటే మనవాళ్లు వేలం వెర్రిగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆంధ్ర ప్రాంతానికి చెందివారు కావడం తమకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు.

కాగా, డిజిపి వ్యాఖ్యలపై మీడియా కథనాలపై పోలీసు శాఖ గుర్రు మంటోంది. డిజిపి ప్రకటనను మీడియా వక్రీకరించిందని మండిపడుతోంది. ప్రకటనపై వివరణ ఇస్తూ డిజిపి కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. డిజిపి ప్రకటనపై మహిళా సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls