దాంతో ఆమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ కు
మనల్ని పుట్టించిన ఆ సృష్టి కర్తకి నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను, నాకు ఇంత మంచి జీవితాన్ని ప్రశాదిన్చినందుకు నా ఈ జన్మంతా రుణపడి ఉంటాను.
29, డిసెంబర్ 2011, గురువారం
మహేష్ సినిమానుంచి సమంత ఔట్ !?
మహేష్ బాబు, దిల్ రాజు కాంబినేషన్ లో రూపొందుతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలోంచి సమంతను తీసేస్తున్నారని టాక్. మహేష్,సమంత కాంబినేషన్ లో వచ్చిన దూకుడు సూపర్ హిట్ కావటంతో ఈ జంటను రిపీట్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆమె ఇప్పుడు డేట్ల సమస్యలో కూరుకుపోయింది. ఆమెపై రీసెంట్ గా బెల్లంకొండ సురేష్ సైతం నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేసారు. నందినీరెడ్డి దర్సకత్వంలో రూపొందే చిత్రం కోసం ఆమె డేట్స్ తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ సరసన ఎవడు లోనూ,గౌతమ్ మీనన్ ట్రైలిగ్వువల్ చిత్రంలోనూ,నాగచైతన్య ఆటోనగర్ సూర్యలోనూ బిజీగా ఉంది.
దాంతో ఆమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ కు
హాజరుకాలేకపోవటంతో షూటింగ్ వాయిదా వేసుకున్నారు. ఓ ప్రక్క చిత్రంలో మరో హీరోగా చేస్తున్న వెంకటేష్ సరసన చేసే వారు దొరకక తలపట్టుకు కూర్చున్న నేపద్యంలో సమంత డేట్స్ సమస్యను కూడా ఫేస్ చేయటం కష్టమనిపించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని అడ్డాల శ్రీకాంత్ డైరక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో వెంకటేష్,మహేష్ అన్నదమ్ములుగా కనిపించనున్నారు. వారి తల్లి తండ్రులుగా జయసుధ,ప్రకాష్ రాజ్ అలరిస్తారు
దాంతో ఆమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ కు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls