
తిరుపతి: తనకు పదవి రానందుకు తన వర్గం శాసనసభ్యులలో కొందరికి అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమేనని, అది కనిపిస్తోందని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి శుక్రవారం చిత్తూరు జిల్లాలో అన్నారు. కొందరిలో ఆ అసంతృప్తి కనిపించినప్పటికీ అధిష్టానం ఎవరికీ అన్యాయం చేయదని, సమయం వచ్చినప్పుడు పదవులు దక్కుతాయన్నారు. అయినా పదవుల విషయం తాను ఆలోచించడం లేదని అది అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు దగ్గరగా ఉండాలన్నదే తన ఆలోచన అని, ప్రజలకు ఏదో ఒకటి చేసేందుకే వచ్చానని అందుకోసం వారికి దగ్గరగా ఉండాలన్నారు.
ప్రజలకు దగ్గరగాఉండేందుకు ఏ అవకాశాన్ని వదలనన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేయడం కోసం సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారనటంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తుపాకుల మునెమ్మ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరటం ఆమె వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఆమె ఇష్టం ఉన్న పార్టీలో చేరారని అందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls