29, డిసెంబర్ 2011, గురువారం

షిండేతో సీఎం కిరణ్ భేటి

న్యూఢిల్లీ: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని షిండే దృష్టికి సీఎం తీసుకువచ్చారు. రాష్ట్రానికి అదనపు విద్యుత్‌ను కేటాయించాలని సీఎం విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. అయితే సీఎం కిరణ్ ప్రతిపాదనల్ని పరిశీలిస్తామని షిండే హామీ ఇచ్చారు. ఇప్పటికే 240 మెగావాట్ల విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించామని, అదనపు విద్యుత్‌ను మార్చి నెల వరకు కొనసాగిస్తామన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls