27, డిసెంబర్ 2011, మంగళవారం

రీసెర్చ్ ప్రకారం 'బ్రాడ్‌మెన్' కంటే 'సచినే' గొప్ప..

Tendulkar and Bradman
సచిన్ వందో సెంచరీకి దగ్గర పడిన సందర్బంలో కొత్త కొత్త ప్రచారాలు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు ఎంతో మంది అభిమానులను వేధించిన క్వచ్చన్‌కి సమాధానం ఇప్పుడు లభించింది. ఇంతకీ ఆ క్వచ్చన్ ఏమిటని అనుకుంటున్నారా.. ఆస్టేలియా దిగ్గజ టెస్టు బ్యాట్స్ మెన్ సర్ డొనాల్డ్ బ్యాట్స్ మెన్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వీరిద్దరిలో ఎవరు గొప్ప అన్న ప్రశ్నకు గాను ... ఎకనమిక్స్ రీసెర్చర్ నిర్వహించిన సర్వేలో ఇండియన్ ఐకాన్ సచిన్ టెండూల్కర్‌ని, బ్రాడ్ మెన్‌తో పొల్చితే సచినే గొప్ప క్రికెటర్ అని సమాధానాలు వచ్చాయి.

వివరాల్లోకి వెళితే గ్రీఫ్త్ యూనివర్సిటీ రీసెర్చర్ డాక్టర్ నికోలస్ రోడ్ ఎకనమిక్ ధీరీని ఉపయోగించి వివిధ మార్గాల ద్వారా క్రికెడ్ దేవుడు సచిన్ టెండూల్కర్, బ్రాడ్ మెన్‌ల బ్యాటింగ్‌ని విశ్లేషించి ఈ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. 1989లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేటం చేసిన సచిన్ టెండూల్కర్ ఇప్పటి వరకు 184 టెస్టు మ్యాచ్‌లు ఆడి 56.02 సగటుతో 15,183 పరుగులు చేయడం జరిగింది. ఇక బ్రాడ్ మ్యాన్ విషయానికి వస్తే 1928 నుండి 1948 వరకు 52 టెస్టు మ్యాచ్‌లు ఆడి 99.94 యావరేజితో 6996 పరుగులు చేశాడు. 92 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అంటే 2001లో సర్ డొనాల్డ్ బ్రాడ్ మెన్ మరణించాడు.

ఎకనమిక్ ధీరిటికల్ ఎనాలసిస్ ప్రకారం బ్రాడ్ మెన్‌ని సచిన్ టెండూల్కర్ అధిగమించాడని పేర్కోన్నాడు. వివిధ ఆటగాళ్లకు సంబంధించిన కెరియర్‌ని దృష్టిలో పెట్టుకొని వారికి ర్యాంకులు నిర్ణయించామని రోడ్ తన ప్రకటనలో తెలిపాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls