సెలబ్రిటీలు ఉపయోగించిన కార్లంటే ఎవరికి మాత్రం క్రేజ్ ఉండదు చెప్పండి. ఇలాంటి కార్లకు ఎంత డిమాండ్ ఉంటుందంటే.. లక్ష రూపాయలు ఖరీదు చేయని కార్లు సైతం కోట్ల రూపాయల్లో అమ్ముడవుతుంటాయి. ఇప్పటి వరకూ వివిధ సెలబ్రిటీలు, రాజులు, పురాతన కార్ల వేలానికి సంబంధించి వివిధ కథనాలను చదివే ఉంటాం. అయితే, ఇప్పుడు తాజాగా.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వాడిన కారు ఒకటి వేలానికి వచ్చింది.
బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడు కాకముందు ఉపయోగించిన గ్రే కలర్ 2005 మోడల్ క్రిస్లర్ 300సి సెడాన్ కారు ప్రస్తుతం వేలానికి వచ్చింది. ప్రముఖ ఆన్‌లైన్ ఆక్షన్ సంస్థ ఈబే (eBay)లో ఈ కారును వేలానికి ఉంచారు. ఈ కారును 19000 కి.మీ. వరకూ బరాక్ ఒబామా నడిపారని, సదరు ప్రకటనలో పేర్కొనబడి ఉంది. వేలంలో ఈ కారు కోసం ప్రారంభ పాట (స్టార్టింగ్ బిడ్) జస్ట్ 10 లక్షల అమెరికన్ డాలర్లు మాత్రమే.
అదే సరికొత్త క్రిస్లర్ 300స కారును కొనాలంటే 27,000 డాలర్లు ఉంటే సరిపోతుంది. సాధారణంగా 2005 మోడల్‌కు చెందిన క్రిస్లర్ 300సి కారును సెకండ్ హ్యాండ్ మార్కెట్లో విక్రయిస్తే, అది మహా అయితే 14,446 డాలర్ల వెల మాత్రమే పలుకుతుంది. కానీ, ఈ కారును ఒబామా ఉపయోగించటం వలన ఇది అత్యం ఖరీదు పలుకుతోంది. ఒబామా ఈ క్రిస్లర్ 300సి కారును 2004 నుండి 2007 వరకూ లీజ్‌కు తీసుకున్నారట. ఇప్పటి వరకూ ఒబామా కారు అనేక క్లిక్‌లు వచ్చాయని, అయితే ఇంతవరకూ సరైన కొనుగోలుదారులు రాలేదని ఈ కారును వేలానికి ఉంచిన సిబర్ తెలిపారు.
అధిక ధరకు అమ్ముడైన ఇలాంటి కార్లు చాలానే ఉన్నాయని, ఇరానియన్ అధ్యక్షుడు మహ్మద్ అహ్మదినెజాద్ వాడిన 1977 ప్యూజో కారు సుమారు 24 లక్షల డాలర్లు పలికిందని, అడాల్ఫ్ హిట్లర్ వాడిన బ్లూ కలర్ మెర్సిడెస్ కన్వర్టిబల్ కారు 80 లక్షల డాలర్లు పలికిందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసింది. త్వరపడండి.. ఒబామా వాడిన క్రిస్లర్ 300సి కారు వేలం ఫిబ్రవరి 1, 2012న ముగియనుంది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈబే వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ప్రస్తుతం బరాక్ ఒబామా, ప్రభుత్వం కేటాయించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన ఆయుధాలతో కూడిన అధ్యక్ష కారులో ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. 18 అడుగుల పొడవుండే ఈ కారును అమెరికా భద్రతా సిబ్బంది ముద్దుగా "ది బీస్ట్" (దెయ్యం) అని పిలుచుకుంటారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls