ప్ర: కాదలిల్ సొదప్పువదు ఎప్పడి చిత్ర కథేంటి?
జ: ఇది క్యూట్, ఫన్నీ చిత్రం. ఈ తరం యువత తీరును కళ్ల ముందుంచే చిత్రం. కళాశాల వాతావరణంలో సాగే యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టెయినర్. సీనియర్ నటుడు సురేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం చిత్రానికి అదనపు ఆకర్షణ అవుతుంది. నేను రెండు పాటలు పాడాను.
ప్ర: ఇందులో ప్రేమ గురించి కొత్తగా ఏమి చెప్పబోతున్నారు?
జ : ప్రేమ గురించి మేము కొత్తగా ఏదో చెప్పే సాహసం చేయడం లేదు. ప్రస్తుతం యువ త తీరు ఎలా ఉంటుందనేది చూపించబోతున్నాం.
ప్ర: చిత్రంలో మీది ప్రేమను తికమక పెట్టే పాత్రగా భావించవచ్చా?
జ : అలాంటి పాత్రే. అయితే నెగెటివ్ పాత్ర మాత్రం కాదు.
ప్ర: నిజ జీవితంలో ప్రేమను తికమక పెట్టిన సందర్భాలు ఉన్నాయా?
జ : నేను సినిమాకు రాకముందు నుంచే ప్రేమను తికమక పెడుతున్నాను. షూటింగ్‌లో పడి ఆ కార్యక్రమానికి కాస్త విశ్రాంతి నిచ్చాను.
ప్ర: హీరోయిన్ అమలాపాల్ గురించి?
జ : అమలాపాల్ ఈ చిత్రంలో ఆమె వయస్సుకు తగ్గ పాత్రను పోషించారు. అమలాపాల్‌ను మరో కోణంలో ఆవిష్కరించే చిత్రం కాదలిల్ సొదప్పువదు ఎప్పడి. ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తీసుకొస్తుంది.
ప్ర: తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించడం లేదే?
జ: నిజం చెప్పాలంటే నటించడానికి నేను రెడీ. ఎవరూ అవకాశం ఇవ్వడం లేదు. అందువల్లే నిర్మాతగా కూడా మారాను. ఇకపై వరుసగా తమిళ చిత్రాలు చేయాలనుకుంటున్నాను. దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయి. కాదలిల్ సొదప్పువదు ఎప్పడి విడుదల తరువాత మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. 2012లో మంచి ఫలితాల్ని చవిచూస్తాననే నమ్మకం ఉంది. నాలుగైదు భాషల్లో నటిస్తున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls