27, డిసెంబర్ 2011, మంగళవారం

మద్దెలచెర్వు సూరికి తగిన శాస్తి జరిగింది: పటోళ్ల


హైదరాబాద్: మద్దెలచెర్వు సూరికి తగిన శాస్తి జరిగిందని దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి హత్య కేసులో నుండి బయట పడిన పటోళ్ల గోవర్ధన్ రెడ్డి గురువారం ఓ టీవీ కార్యక్రమంలో అన్నారు. భారీ అక్రమాలు, మోసాలకు పాల్పడిన మద్దెలచెర్వు సూరికి ఆయన ప్రధాన అనుచరుడు భాను కిరణ్ తగిన శాస్తి చెప్పారన్నారు. పరిటాల రవి హత్య కేసులో తన హస్తం లేదన్నారు. మొద్దు శీను అమాయకుడన్నారు. మొద్దు శీనును మద్దెలచెర్వు సూరియే హత్య చేశారన్నారు. కానీ ఓం ప్రకాశ్‌ను బలి చేశారన్నారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తానన్నారు. విప్లవ దేశభక్త పులులు అనే పేరుతో తాను ఉద్యమిస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను జైలులో ఉన్నప్పుడు సెటిల్మెంట్లు, హత్యలు చేయించాననే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తనది తెలంగాణవాదమే అన్నారు.

కాగా పరిటాల రవి హత్యకేసులో మద్దెలచెర్వు సూరితో పాటు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి తదితరులు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే పటోళ్ల ఇటీవలె నిర్దోషిగా బయటపడ్డాడు. పరిటాల రవి హత్య తర్వాత నిందితులు వరుసగా హత్యకు గురయ్యారు. మద్దెలచెర్వు సూరి కూడా ఇటీవలె ఆయన ప్రధాన అనుచరుడు భానుకిరణ్ చేతిలో హత్యకు గురయ్యాడు. అయితే భానును పోలీసులు ఇప్పటి వరకు పట్టుకోలేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls