అభిమానుల సభ రసాభాస
నెల్లూరు (దర్గామిట్ట) : అభిమానులు వేదికముందుకు వచ్చి హంగామా చేయడంతో సభ రసాభాసగా మారింది. చిరంజీవి ప్రసంగించే సమయంలో గందరగోళం చెలరేగి తోపులాటకు దారితీసింది. చాలామంది ఎలాగోలా తప్పించుకుని సభ నుంచి బయటపడ్డారు. సభ ప్రారంభంలో హాలు మొత్తం నిండింది. తోపులాటతో చిరంజీవి ప్రసంగించే సమయంలో వేదిక ముందు నాలుగైదు వరుసలు తప్ప హాల్ అంతా ఖాళీగా కనిపించింది. అభిమానులను కట్టడి చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారు. కార్యక్రమం మొదలైన పావుగంట తర్వాత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, ఆయన సోదరుడు విజయకుమార్‌రెడ్డితో కలిసి వేదికపైకి వచ్చి చిరంజీవికి శాలువా కప్పి ఆలింగనం చేసుకున్నారు.
చిరంజీవి తొలుత పలువురు మహిళలకు కుట్టుమిషన్లు, చీరలు, వికలాంగులకు ట్రైసైకిళ్లుపంపిణీ చేశారు. జాతీయస్ధాయి స్కేటింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన నెల్లూరు బాలికలకు ప్రశంతాపత్రాలు, షీల్డులు బహూకరించారు. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం లక్ష మొక్కలను పంపిణీ చేయనున్నట్లు ఈ సందర్భంగా చిరంజీవి యువత గౌరవ అధ్యక్షుడు ముక్కాల ద్వారాకనాథ్ తెలిపారు. చిరంజీవి స్ఫూర్తితో తన దేహాన్ని కూడా దానం చేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి చిరంజీవి వెంట ఉన్నారు. చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి, నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు, రవీంద్ర, మునిగిరీష్, నన్నేసాహెబ్, చింతాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls