ఎన్టీఆర్ కూడా ఈసారి సంక్రాంతి సినిమాల బరిలో నిలవనున్నారు. ఎన్టీఆర్ అంటే కొంపతీసి జూనియర్ ఎన్టీఆర్ అనుకోవద్దు. నందమూరి తారక రత్న తన పేరును ‘నందీశ్వరుడు’ సినిమా నుంచి ఎన్టీఆర్ గా మార్చుకున్న సంగతి తెలిసిందేగా.
తారక రత్న నటించిన ‘నందీశ్వరుడు’ సినిమా డిసెంబర్ 23నే విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా ను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు నిర్మాతలు. ఇటీవల విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఏ తేదీ అనే విషయం మాత్రం ఇంకా స్పష్టం చేయలేదు. జనవరి మొదటి వారంలో విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
శ్రీను యజరాల దర్శకత్వం వహించిన ‘నందీశ్వరుడు’ కన్నడలో రిలీజై సూపర్ హిట్టయిన ‘డెడ్లీ సోమ’కు రీమేక్. బిందాస్ ఫేమ్ షీనా ఇందులో కథానాయిక. సెగు రమేష్ బాబు, గంగాధర్ రెడ్డి..కెఎఫ్ అండ్ ఎస్ఆర్‌బి ఆర్ట్స్ ప్రోడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తారక రత్న తెరంగ్రేటం చేసి ఇన్ని సంవత్సరాలైన ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ సరైన హిట్ లేదు...ఈ నేపథ్యంలో ‘నందీశ్వరుడు’ సినిమా తారక రత్న సినీ భవిష్యత్ ను తేల్చే సినిమా అనే వాదన వినిపిస్తోంది. ఈ సినిమా హిట్టయితే తారక్ సినిమాల్లో కొనసాగే పరిస్థితి ఉంటుందని, లేక పోతే సినిమాలకు దూరం కావడం ఖాయం అంటున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls