మనల్ని పుట్టించిన ఆ సృష్టి కర్తకి నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను, నాకు ఇంత మంచి జీవితాన్ని ప్రశాదిన్చినందుకు నా ఈ జన్మంతా రుణపడి ఉంటాను.
29, డిసెంబర్ 2011, గురువారం
రీఎంబర్స్‌మెంట్‌పై వైఎస్‌ఆర్‌సీపీ ధర్నా
హైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీఎంబర్స్‌మెంట్ కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖం పూరించింది. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 4 తేది నుంచి భారీ స్థాయిలో ఆందోళనలు, ధర్నాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.
ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై నిర్వహిస్తున్న ‘ఫీజు ధర్నా’ పోస్టర్‌ను గురువారం ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీనేతలు కొణతాల రామకృష్ణ, పుత్తా ప్రతాప్‌రెడ్డిలు విడుదల చేశారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో హైదరాబాద్‌లో ఫీజు ఫోరు దీక్ష చేసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల్లో కదలిక తేవడానికి రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం కార్యక్రమాల్ని చేపడుతోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయానికి తిలోదకాలిచ్చిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగడుతోంది. ఇందులో భాగంగానే వచ్చే నెల నాలుగో తేదిన అన్ని జిల్లా కలెక్టరేట్‌ల ముందు ఫీజు ధర్నా పేరుతో పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు నిర్వహించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls