
నెల్లూరు: తమపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేసే ప్రతి విమర్శ కూడా దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికే తగులుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. జగన్ స్వార్థం వల్లనే ఉప ఎన్నికలు వస్తున్నాయని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రైతులపై ప్రేమ ఉన్నట్లు వైయస్ జగన్ నటిస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శిసంచే స్థాయి వైయస్ జగన్‌కు లేదని ఆయన అన్నారు. ఓదార్పు పేరుతో జగన్ స్వార్థ రాజకీయ యాత్ర చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రాన్ని పాలించాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వైయస్ రాజశేఖర రెడ్డికి అవకాశం ఇచ్చారని ఆయన అన్నారు. వైయస్ హయాంలో పేరుకుపోయిన ఫీజు బాకీలు కిరణ్ కుమార్ రెడ్డి విడుదల చేశారని ఆయన చెప్పారు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, కోవూరు ఉప ఎన్నికల్లో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వైయస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బోధనా ఫీజుల కింద రూ.5,400 కోట్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. జగన్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను మంట గలుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, ఆనం సోదరులు రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డిలపై వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి ధ్వజమెత్తారు. వేటు తప్పదు కాబట్టి తాము ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. వీర ప్రగల్భాలు పలుకుతున్న ఆనం సోదరులు ఉదయగిరిలో కాంగ్రెసు అభ్యర్థిని పెట్టాలని ఆయన సవాల్ చేశారు. ఉప ఎన్నికల్లో ప్రజలే ఆనం సోదరులకు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls