28, డిసెంబర్ 2011, బుధవారం

అందమైన ప్రేమకథగా ఇష్క్


‘‘ఓ జంటతో ప్రేమ ఆడుకున్న వింత ఆటే మా ‘ఇష్క్’’’ అని దర్శకుడు విక్రమ్‌కుమార్ అన్నారు. నితిన్, నిత్యామీనన్ జంటగా శ్రేష్ట మూవీస్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రం రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇదొక అందమైన ప్రేమకథ. ఈ కథలో ఆర్ద్రత ఉంటుంది. ఆనందం ఉంటుంది. అద్భుతం అనిపించే సంగీతం ఉంటుంది.

సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుంది. లెజెండ్రీ కెమెరామేన్ పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ఆయువుపట్టు. ప్రతి ఫ్రేమ్ ఓ పెయింటింగ్‌ని మరిపిస్తుంది. యువసంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్ చక్కని బాణీలను అందించారు. ఫైట్ మాస్టర్ విజయ్ నేతృత్వంలో చిత్రీకరించిన పతాక సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి.

వచ్చే నెల మొదటి వారంలో పాటలను, ఫిబ్రవరి తొలివారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: రమేష్ సామల, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఆర్ట్: రాజీవ్ నాయర్, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls