హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లక్ష ఉద్యోగాలపై ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కే అనుమానం వచ్చిందని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి గురువారం విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన రాజీవ్ యువకిరణాలపై రేవంత్ విమర్శలు గుప్పించారు. డిసెంబర్ నెలాఖరులోగా లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మరో మూడు రోజుల్లోగా ఆ ఉద్యోగాలను ఎక్కడి నుండి తీసుకు వచ్చి ఇస్తారని ప్రశ్నించారు. నిరుద్యోగులను ప్రభుత్వం మభ్య పెడుతోందని విమర్శించారు.
కిరణ్ తన వ్యక్తిగత ప్రచారం కోసమే లక్ష ఉద్యోగాలు ప్రకటించారన్నారు. ఈ పథకం నిరుద్యోగులను నిరుత్సాహానికి గురి చేస్తుందన్నారు. ప్రజా ధనాన్ని కాంగ్రెసు ప్రభుత్వం తీవ్రంగా దుర్వినియోగం చేస్తుందని ధ్వజమెత్తారు. ఉద్యోగాలపై సిఎం ఢిల్లీలో ప్రకటించిన తర్వాతే రాష్ట్రానికి రావాలన్నారు. తమను కుక్కలతో పోల్చిన కెసిఆర్ నక్కలా తెలంగాణ ప్రజలను వంచించారని విమర్శించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls