మెల్‌బోర్న్: ఛాపెల్ గంగూలీ వీరిద్దరి మద్య ఉన్న అనుంబంధం వివరించలేనిది. చాపెల్ రచించిన తన ఆటో బయోగ్రఫీ ‘ఫియర్స్ ఫోకస్’లో గంగూలీపై తీవ్రమైన విమర్శలు గుప్పించాడు. కెప్టెన్‌గా గంగూలీ ఎంతో కఠినంగా వ్యవహరించేవాడని, కెప్టెన్ లక్షణాల కన్నా ఆధిపత్యం చెలాయించాలనే తాపత్రాయం గంగూలీ అధికంగా కనిపించేదని చాపెల్ అన్నారు. గంగూలీలో ఒక నాయకుడికి ఉండవల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. బ్యాటింగ్‌లో కూడా అద్బుతమైన ప్రతిభ ఉంది. కానీ ఏమి లాభం ఎప్పడూ కూడా తనకు అనుమానం పిచ్చే, జట్టులో మార్పులకంటే రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టేవాడని గంగూలీపై విమర్శలు గుప్పించాడు.
2005లో తాను భారత జట్టు కోచ్ పగ్గాలు స్వీకరించేందుకు గంగూలీ కూడా సహాయం చేసిన మాట వాస్తమే అయినప్పటికీ ఆ తర్వాత అతని ధోరణిలో మార్పు వచ్చిందని భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ అన్నాడు. చివరకు గంగూలీ ఎలా తయారయ్యాడంటే ‘నీకు నేను మద్దతిచ్చా. నీవు నాకు మద్దతివ్వు అనే విధంగా తయారయ్యాడు. నాకు సహాయం చేసినందుకు అతనికి ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉండాలని భావించాడు. ఆ సమయంలో అతడు కెప్టెన్సీ కోసం పోరాడుతున్నాడు. కానీ నా మొదటి కర్తవ్యం మాత్రం భారత క్రికెట్‌ను సరిదిద్దడంగా భావించా. అప్పటికే జట్టులో విభేదాలు మొదలయ్యాయి.
యువకులకు మాట్లాడే అర్హత లేదు. జట్టు సమావేశంలో సీనియర్ల ముందు ఏదైనా మాట్లాడితే ఎక్కడ వేధిస్తారేమోనని భయపడేవారు. దీన్ని గమనించి మూడు కేటగిరీలుగా సమావేశాలు నిర్వహించి వాళ్ల ఆలోచనలు తెలుసుకునేవాడ్ని’ అని చాపెల్ పేర్కొన్నారు. ఒకసారి జింబాబ్వే పర్యటనలో అతని నిర్ణయాలకు ఓ దశలో ఆటగాళ్లూ విసిగిపోయారు. నేను చెప్పినప్పుడు అన్నింటికి ఆమోదం తెలిపేవాడు. కానీ తర్వాత తన మార్గంలో వెళ్లేవాడు. సీనియర్లు కూడా అలానే చేసేవాళ్లు. ఓ వార్మప్ మ్యాచ్‌లో టాస్‌కు వెళ్లకపోతే నేను వెళ్లా. తిరిగొచ్చేసరికి మీరెందుకు వెళ్లారని నన్నే ప్రశ్నించాడు. మ్యాచ్‌లో కూడా గాయం కాకపోయినా... అయినట్లు నటించి బ్యాటింగ్ నుంచి వెనక్కి వచ్చేవాడు. ఎంఆర్‌ఐ స్కానింగ్‌కు వెళ్లమంటే వద్దనేవాడు’ అని చాపెల్ వెల్లడించారు.
గంగూలీపై విమర్శలు చేసిన చాపెల్ ధోనిని మాత్రం ప్రశంసలతో ముంచెత్తాడు. ‘జట్టులో ప్రత్యేక సమావేశాలు నిర్వహించినప్పుడు ధోని వెలుగులోకి వచ్చాడు. పరిస్థితిని చాలా తొందరగా అర్థం చేసుకునేవాడు. విషయాన్ని ధైర్యంగా చెప్పేవాడు. అతనిలో నమ్మకం ఎక్కువ. భారత జట్టుకు ఆశాకిరణమని భావించా. నేను పనిచేసిన యువ క్రికెటర్లలో ధోని బాగా ఆకట్టుకున్నాడు’ అని చాపెల్ తన పుస్తకంలో రాశారు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls