అబిడ్స్/సుల్తాన్‌బజార్/ అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: రెవల్యూషనరీ పేట్రియాటిక్ టైగర్స్ (ఆర్‌పీటీ) వ్యవస్థాపకుడు పటోళ్ల గోవర్దన్‌రెడ్డి హత్యోదంతం సిటీలో కలకలం రేపింది. పట్టపగలు నగరం నడిబొడ్డున ఆయన హ త్యకు గురికావడం సంచలనం సృష్టించింది. తన నీడను సైతం నమ్మని పటోళ్ల ఎల్లప్పు డూ ఒంటరిగానే సంచరిస్తుంటాడు. అ నుచరులు, అవసరమైన వారిని కలిసేటప్పుడు సై తం అనేక జాగ్రత్తలు తీసుకుంటాడు. అయితే మంగళవారం మాత్రం తన అనుచరుడితో కలిసి ఓ ఎమ్మెల్యేను కలిసేందుకు ఓల్డ్ ఎమ్మె ల్యే క్వార్టర్స్‌కు వచ్చాడు. ఆ అనుచరుడి సా యంతోనే పటోళ్లను హతమార్చినట్టు తెలుస్తోంది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అబిడ్స్ వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఆయనను.. పక్కా ప్రణాళికతో ప్రత్యర్థులు మట్టుబెట్టారు. పటోళ్లను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచే దుండగులు వెంబడించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆటోలో పటోళ్ల ఉన్నాడన్న సమాచారం అనుచరుడే వీరికి అందించి ఉండచ్చని భావిస్తున్నారు. పథకం ప్రకారం జీరాగల్లికి చేరుకున్న తర్వాత ఆటో ఆపించి, హత్యకు ఒడిగట్టినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. ఆటోడ్రైవర్ సయ్యద్ ఇస్మాయిల్ చెప్తున్న వివరాలూ ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఘటన స్థలాన్ని ఈస్ట్‌జోన్ డీసీపీ గంగాధర్, సుల్తాన్‌బజార్ ఏసీపీ సోమేశ్వరరావులు సందర్శిం చా రు. వీరు ఆటోడ్రైవర్‌ను ఉస్మానియా ఆసుపత్రిలోనే విచారించారు. పోలీస్ జాగీలాలు తిలక్‌రోడ్‌లో అబి డ్స్ వైపు కొంతదూరం వెళ్లి ఆగిపోయాయి. కేసు న మోదు చేసిన పోలీసులు ఆటోడ్రైవర్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ‘పంచనామా’లో గుర్తించిన కానిస్టేబుల్.. హత్య జరిగినట్లు సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టా రు. శవ పంచనామాకని ఉస్మానియా మార్చురీకి వెళ్లిన సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్‌లో రైటర్‌గా పని చేస్తున్న కానిస్టేబుల్ డేవిడ్ హతుడు పటోళ్లగా గుర్తించాడు. పటోళ్ల కుడి చేయి, కాలికి పోలియో ఉండటమే కీలక ఆధారంగా మారింది. మృతదేహంపై 18 కత్తిపోట్లు.. మృతదేహంపై మొత్తం 18 కత్తిపోట్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ వైద్యులు గుర్తించారు. గొంతు, ఛాతి, దవడ, చెవి, భుజాలు, పక్కటెముకలు, వెన్నుముక, వీపు భాగంలో ఇవి ఉన్నాయి. గొంతుపై తగిలిన తీవ్ర గాయమే ప్రాణాలు తీసి ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. మార్చురీకి వచ్చిన బీసీ నేత ఆర్.కృష్ణయ్య పటోళ్ల మృతదేహాన్ని సందర్శించారు. ప్రజల పక్షాన పోరాడే మంచి మిత్రుడిని కోల్పోవడం ఎంతో బాధ కలిగిస్తుందన్నారు. పటోళ్ల భార్య వింధ్యారెడ్డి, కూతురు రష్మిరెడ్డి, కొడుకు కృష్ణచైతన్యారెడ్డి ఉన్నారు. వారు ఆస్పత్రి వద్ద విలపించిన తీరు పలువురిని కలిచివేసింది. నయీం ముఠాపైనా అనుమానం: ఏసీపీ ఈ హత్య వెనుక నయీం ముఠాకు చెందిన వారు ఉన్నట్లు అనుమానాలున్నాయని, ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ సోమేశ్వరరావు చెప్పారు. పటోళ్లకు అనేక మందితో శతృత్వం ఉండటం, గ్యాంగ్‌వార్స్‌లో ప్రమేయం ఉండటంతో అవన్నీ పరిశీలిస్తున్నామన్నారు. మరోపక్క పటోళ్ల పరిటాల రవి హత్య కేసులోనూ నిందితుడిగా ఉండటం (చార్జ్‌షీట్‌లో పేరు లేదు)తో ఆయన అనుచరుల విషయాన్నీ, ఇటీవల జైలు నుంచి విడుదలైన పరిటాల అనుచరుల వివరాలనూ ఆరా తీస్తున్నారు. నన్నూ చంపుతారనుకున్నా.. పటోళ్లను హత్య చేసిన వ్యక్తుల ఆవేశాన్ని బట్టి తనను కూడా కత్తులతో చంపుతారేమోనని భయపడ్డాను. నోటి నుంచి మాటలు కూడా రాలేదు. పదేళ్ల నుంచి ఆటో నడుపుతున్నా.. ఇలాంటి ఉదంతం చూడలేదు. వారు నన్ను వదలడం ఆ దేవుడి దయే. - సయ్యద్ ఇస్మాయిల్, ఆటోడ్రైవర్ స్వగ్రామంలో విషాద ఛాయలు తాండూరు, న్యూస్‌లైన్: పటోళ్ల గోవర్దన్‌రెడ్డి దారుణ హత్యకు గురి కావడంతో ఆయన స్వగ్రామమైన తాండూరు మండల పరిధిలోని మల్‌రెడ్డిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నా యి. మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన పటోళ్లకు ముగ్గురు సోదరులు, ఓ సోదరి ఉన్నారు. తన తల్లి సుశీలమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి గత జనవరిలో చివరిసారిగా స్వగ్రామానికి వచ్చారు. హత్య విషయం తెలిసిన స్థానికులు వారి ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. క్రిస్మస్ సెలువులు ఉండటంతో పిల్లలతో కలిసి కు టుంబ సభ్యులందరూ వికారాబాద్‌కు వెళ్లిపోయారని స్థాని కులు చెప్పారు. నయీం గ్యాంగ్ పనే.. ఉప్పల్‌లో ఓ స్థల విషయంలో నయీంతో పటోళ్లకు వివాదం నెలకొంది. నయీముద్దీన్, పోలీసులు.. పటోళ్ల అనుచరుడైన అనీల్‌తో కలిసి కుట్ర పన్ని దారుణంగా హత్య చేశారు. ఐదు రోజులుగా ఆయన ఇంటికి రాలేదు. సోమవారం రాత్రే వచ్చారు. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే వద్దకు వెళ్తున్నానని చెప్పి వెళ్లారు. మధ్యాహ్నం ఫోన్ చేసి క్షేమంగానే ఉన్నట్లు చెప్పారు. అంతలోనే ఈ దారుణం జరిగింది. - వింధ్యారెడ్డి, మృతుడి భార్య తెలిసిన వారి పనే: ఖాన్ మెహిదీపట్నం, న్యూస్‌లైన్: పటోళ్ల గోవర్దన్‌రెడ్డి హత్య తెలిసిన వారి పనే అయి ఉంటుందని నగర పోలీసు కమిషనర్ ఏకే ఖాన్ పేర్కొన్నారు. హత్య జరిగిన ఆటోలో తెలిసిన వ్యక్తే ప్రయాణించినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. మంగళవారం మెహిదీపట్నంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. హత్యోదంతంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోందని ప్రారంభమైందని చెప్పారు. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. ఐదారు నెలలుగా సిటీలో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని చెప్పారు. భవిష్యత్‌లో ఈలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. | |
మనల్ని పుట్టించిన ఆ సృష్టి కర్తకి నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను, నాకు ఇంత మంచి జీవితాన్ని ప్రశాదిన్చినందుకు నా ఈ జన్మంతా రుణపడి ఉంటాను.
28, డిసెంబర్ 2011, బుధవారం
hydrabad సిటీలో.. రక్త చరిత్ర
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls