
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గతంలో నటించిన డాన్ చిత్రానికి సీక్వెల్ అయిన "డాన్2" టికెట్లను ఇప్పుడు సులువుగా పైసా ఖర్చు లేకుండా పొందవచ్చు. అదెలా అనుకుంటున్నారా..? దేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పుడు ఓ బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది.
కంపెనీ ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన హ్యుందాయ్ ఇయాన్ కారును టెస్ట్ డ్రైవ్ చేసిన వారికి డాన్2 సినిమా టికెట్లు గెల్చుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. దాదాపు అన్ని హ్యుందాయ్ డీలర్‌షిప్‌లలో కంపెనీ ఈ ప్రమోషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా, హ్యుందాయ్ ఇయాన్ కారును టెస్ట్ డ్రైవ్ చేసిన వారికి డాన్2 పోస్టర్లను కూడా అందిస్తుంది.
ఈ అవుట్‌లెట్లలో ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో గెలిచిన వారికి ప్రముఖ థియేటర్లలో రెండు డాన్2 టికెట్లను ఇవ్వనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం దేశీయ విపణిలో హ్యుందాయ్ ఇయాన్ ధరలు రూ.2.70 లక్షల నుండి రూ.3.72 లక్షలుగా ఉంది.
డాన్2 చిత్రంలో 2012 హ్యుందాయ్ సొనాటా సెడాన్, శాంటాఫే ఎస్‌యూవీ కార్లతో షారుఖ్ ఖాన్ చేసిన సాహస రైడ్‌లను, స్టన్నింగ్ కార్ ఛేజ్‌లను చూడొచ్చు. మరికెందుకు ఆలస్యం వెంటనే మీ సమీపంలోని హ్యుందాయ్ అవుట్‌లెట్‌కు వెళ్లి ఇయాన్ కారును టెస్ట్ డ్రైవ్ చేసి డాన్2 సినిమాను ఫ్రీగా చూసే లక్కీ ఛాన్స్‌ను సొంతం చేసుకోండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls