న్యూఢిల్లీ: భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ పట్ల తన కోపాన్ని మాజీ సారథి సౌరవ్ గంగూలీ మరోసారి వెళ్లగక్కాడు. దాదా ఈసారి 'ఛాపెల్'ని పిచ్చోడిగా అభివర్ణించాడు. అతడు ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుతో ఉండటం వల్ల భారత్‌కు మేలు కలిగిస్తుందన్నాడు. టెస్టు సిరీస్‌లో సచిన్, సెహ్వా గ్ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్‌ను ఎదుర్కొనేందుకు చాపెల్‌తో కంగారూలకు పాఠాలు చెప్పించడం టీమిండియాకు శుభసూచకమని అన్నాడు. 'గత భారత పర్యటనలో ఆసీస్ వెంట చాపెల్ కూడా వచ్చాడు. అప్పట్లో సెలెక్టర్‌గా, అకాడమీ చీఫ్‌గా ఉన్నాడు. అయినా కంగారూల వ్యూహాలు ఇక్కడ సాగలేదని దాదా ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధించాడు.
వాళ్ల ఆటతీరును ఏమాత్రం మెరుగుపరచలేకపోయాడు. ఏ జట్టుకు కోచ్‌గా పనిచేసినా విఫలమైనట్టు అతను నిరూపించుకున్నాడు. సమస్యలన్నీ చాపెల్‌తో వస్తాయని అందరూ గ్రహించారు. ఎవరైనా ఒకసారి తప్పు చేస్తారు. అతను మాత్రం అవే తప్పులను పునరావృతం చేస్తాడు. ఇటీవల కాలంలో గ్రెగ్ ఛాపెల్‌ని ‘సెలక్టర్‌గా, బ్రిస్బేన్‌లో అకాడమీకి చైర్మన్‌గా రెండు పదవుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. సాధారణంగా ఎవరైనా ఓసారి తప్పుచేసి సరిదిద్దుకుంటే ఓకే. అదే తప్పును మళ్లీ చేసి ఉద్యోగం పోగొట్టుకుంటే అతడిని పిచ్చోడని అంటారు. ఇప్పుడు చాపెల్ కూడా అదే పరిస్దితిలో ఉన్నాడని వ్యాఖ్యానించాడు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls