31, డిసెంబర్ 2011, శనివారం

సంక్రాంతి రేసులో ‘ఎన్టీఆర్’

ఎన్టీఆర్ కూడా ఈసారి సంక్రాంతి సినిమాల బరిలో నిలవనున్నారు. ఎన్టీఆర్ అంటే కొంపతీసి జూనియర్ ఎన్టీఆర్ అనుకోవద్దు. నందమూరి తారక రత్న తన పేరును ‘నందీశ్వరుడు’ సినిమా నుంచి ఎన్టీఆర్ గా మార్చుకున్న సంగతి తెలిసిందేగా.

తారక రత్న నటించిన ‘నందీశ్వరుడు’ సినిమా డిసెంబర్ 23నే విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా ను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు నిర్మాతలు. ఇటీవల విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఏ తేదీ అనే విషయం మాత్రం ఇంకా స్పష్టం చేయలేదు. జనవరి మొదటి వారంలో విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

శ్రీను యజరాల దర్శకత్వం వహించిన ‘నందీశ్వరుడు’ కన్నడలో రిలీజై సూపర్ హిట్టయిన ‘డెడ్లీ సోమ’కు రీమేక్. బిందాస్ ఫేమ్ షీనా ఇందులో కథానాయిక. సెగు రమేష్ బాబు, గంగాధర్ రెడ్డి..కెఎఫ్ అండ్ ఎస్ఆర్‌బి ఆర్ట్స్ ప్రోడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తారక రత్న తెరంగ్రేటం చేసి ఇన్ని సంవత్సరాలైన ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ సరైన హిట్ లేదు...ఈ నేపథ్యంలో ‘నందీశ్వరుడు’ సినిమా తారక రత్న సినీ భవిష్యత్ ను తేల్చే సినిమా అనే వాదన వినిపిస్తోంది. ఈ సినిమా హిట్టయితే తారక్ సినిమాల్లో కొనసాగే పరిస్థితి ఉంటుందని, లేక పోతే సినిమాలకు దూరం కావడం ఖాయం అంటున్నారు.

అలా ఉంటే అబ్బాయిలు రెచ్చిపోతారు: నన్నపనేని

Nannapaneni Rajakumari
Ads by Google
Platinum Love Bands
Celebrate Your True Love with Platinum Love Bands!
PreciousPlatinum.in/Love-Bands
గుంటూరు: అమ్మాయిల వస్త్రధారణపై పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) దినేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యను తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ నన్నపనేని రాజకుమారి సమర్థించారు. అమ్మాయిలు అవయవాలకు తగిన వస్త్రాలను ధరించాలని, ఆలా కుకుంటే అబ్బాయిలు రెచ్చిపోతారని ఆమె శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. డిజిపి దినేష్ రెడ్డి అలాంటి ప్రకటన చేయడం సమంజమేనని ఆమె అభిప్రాయపడ్డారు. డిజిపి ప్రకటనలో ఏ విధమైన తప్పు లేదని, వస్త్రధారణపై అందరూ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

అమ్మాయిల వస్త్రధారణ అభ్యంతకరంగా ఉంటోందని ఆమె అన్నారు. అమెరికాలో మన సంప్రదాయాన్ని గౌరవిస్తూ చీరలు ధరిస్తుంటే మనవాళ్లు వేలం వెర్రిగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆంధ్ర ప్రాంతానికి చెందివారు కావడం తమకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు.

కాగా, డిజిపి వ్యాఖ్యలపై మీడియా కథనాలపై పోలీసు శాఖ గుర్రు మంటోంది. డిజిపి ప్రకటనను మీడియా వక్రీకరించిందని మండిపడుతోంది. ప్రకటనపై వివరణ ఇస్తూ డిజిపి కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. డిజిపి ప్రకటనపై మహిళా సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

తన పిల్లలతోనే హన్సిక న్యూఇయర్ సంబరాలు

Hansika
ఈ న్యూఇయర్ ను హీరోయిన్ హన్సిక తన పిల్లతోనే జరుపుకోనుంది. ఇంతకీ హన్సిక పెళ్లెప్పుడు చేసుకుంది? పిల్లలను ఎప్పుడు కనిందని అనుకుంటున్నారా?....

తన 20వ పుట్టినరోజు సందర్భంగా హన్సిక ఈ సంవత్సరం ఆగస్టులో 20మంది అనాద పిల్లలను దత్తత తీసుకుంది. ఆ పిల్లల చదువు, ఆహారానికయ్యే ఖర్చుని తనే భరించాలని నిర్ణయించుకుంది. వీలు కుదిరినప్పుడల్లా వారిని కలుస్తుంది కూడా. న్యూఇయర్ వేడుకలను తన పిల్లలతోనే జరుపుకోవాలని నిర్ణయించుకుంది.

తమిళ చిత్రం ‘ఒకెఒకె’ షూటింగ్‌లో 10 రోజులు పాల్గొని ఇటీవలే జోర్డాన్ నుంచి ముంబయ్ చేరుకున్న హన్సిక న్యూ ఇయర్‌ని అక్కడే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. న్యూఇయర్ వేడుక స్నేహితులతో కలిసి చేసుకుంటే ఆ ఆనందం తనకు, తన స్నేహితులకు మాత్రమే పరిమితమవుతుంది. అదే తను దత్తత తీసుకున్న 20 మంది పిల్లలతో కలిసి చేసుకుంటే… వారి కళ్లల్లో కనిపించే ఆనందాన్ని దేనితోనూ వెలకట్టలేం అని అంటోంది. కొత్త సంవత్సరం రోజె తన పిల్లలందరినీ‘రోడ్ ట్రిప్’ తీసుకెళ్లాలనుకుంటుందట కూడా...

జగన్, కెసిఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ రుజువు: చంద్రబాబు

Chandrababu Naidu

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ రుజువైందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ వల్లనే తెలంగాణలోని ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని జగన్ నిర్ణయించుకున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్, జగన్ కలిసి పని చేస్తున్నారని తాము చెబుతూనే ఉన్నామని, అది ఈ రోజు రుజువైందని ఆయన అన్నారు. తెలంగాణపై తమ నిర్ణయాన్ని ఎప్పుడో చెప్పామని, మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదని, తాము అఖిలపక్ష సమావేశానికి వెళ్లబోమని ఆయన చెప్పారు. తెలంగాణపై నిర్ణయం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెసు పార్టీది, కేంద్ర ప్రభుత్వానిది అని ఆయన అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే తెలంగాణపై తమను లక్ష్యం చేసుకున్నారని ఆయన విమర్శించారు.

రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో మైనింగ్, ఇసుక తదితర మాఫియాలు పెరిగిపోయాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయని ఆయన అన్నారు. మహిళల దుస్తులపై డిజిపి దినేష్ రెడ్డి చేసిన ప్రకటన సరైంది కాదని, ఇటువంటి ప్రకటనలు మానేసి డిజిపి శాంతిభద్రతలపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. 2011లో ప్రజలకు అన్నీ ఇబ్బందులే కలిగాయని, 2012లో మంచి జరుగుతుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. 2012లో తాము ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.

విద్యుత్ సమస్యను, ధరల పెరుగుదలను ప్రభుత్వం అదుపు చేయలేకపోయిందని ఆయన అన్నారు. ప్రజలపై ప్రభుత్వం 10 వేల కోట్ల రూపాయల భారం మోపిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో పోలీసులు ప్రజల కోసం కాకుండా రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఆయన అన్నారు.

30, డిసెంబర్ 2011, శుక్రవారం

గాలి జనార్దన్ రెడ్డి బయటకు వస్తే అంతే: సిబిఐ

Gali Janardhan Reddy

హైదరాబాద్: తన తల్లి వర్ధంతికి హాజరు కావడానికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సిబిఐ వ్యతిరేకించింది. బళ్లారిలో తన తల్లి వర్ధంతి కార్యక్రమానికి హాజరు కావడానికి రెండు రోజులు పాటు ఎస్కార్‌తో బెయిల్ కోరుతూ గాలి జనార్దన్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్‌పై శుక్రవారం వాదనలు ముగిశాయి. గాలి జనార్దన్ రెడ్డి వాదనలను సిబిఐ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. గాలి జనార్దన్ రెడ్డి బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిబిఐ తరఫు న్యాయవాది వాదించారు. గాలి జనార్దన్ రెడ్డి మధ్యంతర బెయిల్ కోసం పెట్టుకున్న ఈ పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు కొట్టేసింది.

బళ్లారిలో ఇప్పటికే భారీగా గాలి జనార్దన్ రెడ్డి కటౌట్లకు ఏర్పాట్లు చేశారని, వందలాది వాహనాలు సిద్ధం చేస్తున్నారని సిబిఐ వాదించింది. బిజెపి నుంచి బయటకు వచ్చి గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు, మాజీ మంత్రి శ్రీరాములు బళ్లారి రూరల్ శాసనసభా నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. గాలి జనార్దన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత కొత్త పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటానని కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో తల్లి వర్ధంతి కార్యక్రమానికి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు భావిస్తున్నారు.

Gold heads into new year with final quarter loss

Gold heads into new year with final quarter loss

Spot gold is ending 2011 on a weak note after ten consecutive annual gains, heading for its first quarter of losses in more than three years and a new year likely to be dominated by worries about economic growth and sovereign debt.

US gold rose more than 1% on Friday, as sharp falls in the previous session triggered buying interest on the Shanghai market, helping push spot gold up 0.8%.

This brings spot gold to a near-10% gain for the year, but the precious metal is down about 19% from the record peak of USD 1,920.30 an ounce hit in September.

The most-active US gold futures contract gained 1.2% to USD 1,559.90 by 0244 GMT, snapping six consecutive sessions of losses.

Spot gold rose 0.8% to USD 1,557.94, on course for a weekly decline of 3.2%. It was headed for a monthly loss of nearly 11%.

"There was buying interest from Shanghai when the market opened there," said Peter Fung, head of dealing at Wing Fung Precious Metals in Hong Kong.

The active Shanghai gold forwards opened at 312.45 yuan a gram, about $14 below spot gold prices. But the gap quickly closed, as Shanghai gold rose to 318.25 yuan, about USD 9 above spot prices.

The upcoming Lunar New Year in about three weeks will help support gold consumption in China, traders said.

Technical analysis suggested that spot gold could rebound to USD 1,588 during the day, said Reuters market analyst Wang Tao.

Concerns about the euro zone debt crisis continued to weigh on the single currency after Italy's bond auction failed to attract much buying interest and the European Central Bank had to step in and buy Italy's bonds in an effort to slow rising yields.

On the other side of the Atlantic, US employment, housing market and manufacturing data pointed to growing momentum in the world's largest economy.

The dollar index edged lower, after rising to its highest in more than 11 months in the previous session.

A pricier dollar weighs on gold and other commodities as it makes them more expensive for buyers holding other currencies.

( Enjoy Moneycontrol.com on iPad and be prepared for a fantastic experience. Get real time stock quotes, interactive charts, market buzz, and watch CNBC-TV18, CNBC Awaaz live on your iPad. Check out the free moneycontrol app.

Godrej Properties plans to raise equity capital for growth

Adi Godrej, Chairman, Godrej Properties

Godrej Properties will need to raise equity capital to meet growth plans, says company’s chairman Adi Godrej. “"The board resolution is to raise up to Rs 750 crore. The quantum of funds raised will depend on market conditions. We are waiting for conditions to improve,” he adds.

Meanwhile, the real estate developer has entered into private equity agreement with SUN-Apollo India Real Estate Fund to sell 49% stake in its subsidiary, Godrej Premium Builders. The company may continue to take further private equity in some of the ongoing projects, says Adi Godrej, in an interview to CNBC-TV18.

Below is the edited transcript of his interview with CNBC-TV18's Mitali Mukherjee and Sonia Shenoy. Also watch the accompanying videos.

Q: You have sold 49% stake in Godrej Premium Builders. What exactly Godrej Properties accrues from it?

A: Our business model in Godrej Properties is to do joint ventures with land owners. We also take in private equity at the SPV, at the project level. This is one such case.

In this new project in Gurgaon, the NCR region, we have taken in private equity from SUN-Apollo in this project. This means a fair amount of capital will be available from the project, from this joint venture partner. Also, Godrej Properties will be able to book some of its profits from this project upfront.

Q: How much by way of funds do you think will come in and any more such project that are in the pipeline?

A: Godrej Properties is currently doing several projects, about 30 projects in 12 cities. In some of them, we have already taken private equity. We may continue to take further private equity in some of the ongoing projects. Obviously, we cannot announce it until the deal is done.

Q: You have indicated the company’s plans to raise close to Rs 750 crore. How soon you would want to do it? What kind of dilution it will involve? Would you do the entire amount in one tranche?

A: The SEBI and stock exchanges have announced that all companies where promoter holding is above 75% will be required to bring this holding down to 75%. I think the time limit is somewhere around the June of 2013. So, we are planning towards that.

The promoter holding in Godrej Properties is 83%. Now, there are many ways it can be done. One, the promoters could sell some of the shares. The other is there are various means by which you could bring in capital into the company so that the promoter holding is diluted. We prefer the second route because that will enable the company to grow faster. The growth opportunities in Godrej Properties are very strong. We will need more equity capital to be able to continue with these growth plans.

When will it be done? That will depend on two things. One, SEBI is already working on what are the means by which the company could raise funds— the several opportunities. QIP, as of now, is not allowed for such companies. But they may liberalise the regime. We are waiting for SEBI’s action. Once that happens and if the market conditions are conducive, we will raise the funds.

Now, the board resolution is to raise up to Rs 750 crore, whether we raise Rs 750 crore or little less than that will again depend on market conditions.

Q: What is the target with respect to scaling down of debt at Godrej Properties? You are sitting on a sum of about Rs 1,150 crore by way of debt. What is the plan to scale it down to?

A: We may scale down debt or we may not. But the important thing in a company like Godrej Properties is to ensure that the debt/equity ratio is reasonable. So, if we raise further equity, some of that equity raise could go towards debt repayments. Also, the equity base would go up very considerably. So, the debt equity ratio could be quite comfortable. We will work it out depending upon our cash flow needs and the market conditions at that point of time.

( Enjoy Moneycontrol.com on iPad and be prepared for a fantastic experience. Get real time stock quotes, interactive charts, market buzz, and watch CNBC-TV18, CNBC Awaaz live on your iPad. Check out the free moneycontrol app.

Lokpal will be brought in Budget session: Govt

Lokpal will be brought in Budget session: Govt

Putting up a brave front after it failed to muster the numbers in the Rajya Sabha, Government today said the Lokpal Bill will "definitely" be brought before the Rajya Sabha during the Budget session even as Congress leader Digvijay Singh defended the move saying extension of the House last night was not possible.

"Definitely we will bring it in March in the Budget session...we have to study the 187 amendments brought by Opposition parties as most are overlapping.

Some amendments relate to only a part of a clause and not the entire clause, some demand removing the entire part of the Bill," Minister of State for Personnel V Narayanasamy said here.

He said after going through the amendments, the government will take a call on what to accept and what to reject and get back to the Opposition parties. Congress general secretary Digvijay Singh tweeted this morning saying "187 Amendments given till 6 pm on the day of debate and those too contradictory to each other.

Extension of the House not within powers of RS (Rajya Sabha)." He also said, now that government has time, it must "try and bring about consensus and pass a strong implementable Lokpal Bill." Referring to the amendments moved by key UPA partner Trinamool Congress on the Bill in the Rajya Sabha, Narayanasamy said its reservations are regarding the appointment of Lokayuktas in the states and "they have no grievances against Lokpal."

But at the same time the minister said Trinamool was part of the Cabinet decision to clear the Lokpal and Lokayukta Bill introduced in Lok Sabha a few days ago. "Thy voted with us in the Lok Sabha though they had some reservations about the Constitutional amendment...we are talking to them...there is still some time and we will bring them around," he said.

( Enjoy Moneycontrol.com on iPad and be prepared for a fantastic experience. Get real time stock quotes, interactive charts, market buzz, and watch CNBC-TV18, CNBC Awaaz live on your iPad. Check out the free moneycontrol app.

వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళన

దగదర్తి, న్యూస్‌లైన్: ప్రభుత్వ భూములను స్థానికేతరులకు పంచరాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం దగదర్తి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గున్నంరెడ్డి హరికిషోర్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలోని యలమంచిపాడు గ్రామంలోని సర్వే నంబర్ 49 పరిధిలో ఉన్న 1500 ఎకరాలు స్థానికులకేపంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల రెవిన్యూ అధికారులు పంచాయతీ పరిధిలో నిర్వహించిన రెవిన్యూ సదస్సులో బుచ్చిరెడ్డిపాళెం మండలానికి చెందిన కొందరు ఆ భూములు తమకే పంచాలని కోరడం తగదన్నారు.

మండలంలోని తిరువీధిపాడు, తురిమెర్ల గ్రామాలకు చెందిన భూమిలేని అర్హులైన నిరుపేదలకు ఈ సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూములను పంచాలన్నారు. స్థానికులను కాదని స్థానికేతరులకు భూములను కేటాయించరాదని ఆయన అధికారులను కోరారు. డెప్యూటీ తహశీల్దార్ లీలా సంజీవకుమారికి వినతి పత్రాన్ని అందించారు. దీనిపై స్పందించిన ఆమె మండలంలోని ప్రభుత్వ భూములను తొలుత స్థానికులకే పంచుతామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, తిరువీధిపాడు, తురిమెర్ల గ్రామాలకు చెందిన పేదలు పాల్గొన్నారు

‘ఆనం’ది అహంకార ధోరణి

నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అహంకారంతో విర్రవీగుతున్నాడని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. నగరంలోని ఎన్టీఆర్‌భవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇసుక మాఫియా, మద్యం సిండికేట్ల నుంచి నెలమామూళ్లు వసూలు చేస్తున్న వివేకానందరెడ్డి అధికార, ధనబలంతో కన్నూ మిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. ఆనం సోదరులు నగరాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు. 2001లో ఇంటి పన్నులు పెంచినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వివేకా గగ్గోలు పెట్టాడని, ప్రస్తుతం 200 శాతం ఇంటి పన్నులు పెంచి ప్రజలను వేధిస్తున్నారని విమర్శించారు.

ఇంటి పన్నుల పెంపును నిరసిస్తూ గోడలపై రాసిన ప్రచారంలో తన పేరు ఉందనే అక్కసుతో వివేకానందరెడ్డి పలు చోట్ల గోడ రాతలను సైతం మున్సిపల్ సిబ్బందితో తుడిపించి వేశారని పేర్కొన్నారు. నగరంలోని హోర్డింగులు, ప్లెక్సీల పై వివేకా, ముంగమూరు , మరొకరి ఫొటోలు మాత్రమే కన్పించాలంటే కుదరదని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. వివేకానంద రెడ్డికి కొమ్ముకాస్తున్న అధికారులు సైతం త్వరలో జైలుకు పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ధర్మవరపు సుబ్బారావు, వైవీ సుబ్బారావు, పడవల కృష్ణమూర్తి, మండవ రామయ్య, కిలారి వెంకటస్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.

హౌసింగ్ అధికారిపై దాడి

మొనపాళెం(వాకాడు): తుపానులో ప్రజలను అప్రమత్తం చేసిసురక్షిత ప్రాంతాలకు తరలించే నిమిత్తం మొనపాళెం గ్రామానికి వెళ్లిన హౌసింగ్ ఏఈ పుల్లయ్యపై ఆ గ్రామానికి చెందిన మామిడిపూడి శ్రీనివాసులు స్కూటర్ ఆపలేదని మద్యం మత్తులో దాడి చేసి గాయపరిచారు. ఈ విషయం వాకాడు అధికారులకు తెలిపినా ఫలితం లేకపోవడంతో ఆయా గ్రామాల్లోని సైక్లోన్ అధికారులు తాము డ్యూటీలు చేయలేమంటూ నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు తీర ప్రాంతాల్లో భద్రతలేదని డ్యూటీలు చేయలేమంటూ ఐటీడీఏ పీఓ వెంకటేశ్వరరావు, డిప్యూటీ తహశీల్దార్ పూర్ణచంద్రరావుకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఈ విషయాన్ని విలేకరులకు తెలుపగా వారు అధికారులను వివరణ కోరారు. స్పందించిన అధికారులు మొనపాళెం గ్రామానికి వెళ్లి స్పెషల్ అధికారులకు ధైర్యం చెప్పి అతనిపై వె ంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శ్రీనివాసులుపై కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సేవా కార్యక్రమాలను విస్తృతం చేయండి

నెల్లూరు: సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాలని అభిమానులకు తిరుపతి ఎమ్మెల్యే, కాంగ్రెస్‌నేత కె.చిరంజీవి పిలుపునిచ్చారు. స్థానిక అనిల్‌గార్డెన్స్‌లో చిరంజీవి యువత ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన అభిమానుల సభలో ఆయన మాట్లాడారు. ‘‘ నాకు, నాతల్లికి జన్మనిచ్చిన నెల్లూరు గడ్డపై ఎప్పుడు కాలుమోపినా గొప్ప ఆనందం కలుగుతుంది. ఎవ్వరికీ దక్కనిది..నాకు నిరంతరం దక్కేది మీ అభిమానమే.. కోట్లలో ఒక్కరికి దక్కే అవకాశం నాకు దక్కిందంటే అంతా మీ చలవే. కాంగ్రెస్ అధిష్టానం ఏస్థానం ఇచ్చినా అదంతా అభిమానుల చలవే..అన్నింటికంటే గొప్పస్థానాన్ని మీ మనసుల్లో నాకు ఇచ్చారు.’’ అని అన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించాక సినీ పరిశ్రమ ఎప్పుడూ గుర్తుకొస్తుండేదని, సినిమాల్లో నా స్థానాన్ని రామ్‌చరణ్ తేజ భర్తీచేస్తాడన్నారు.

అభిమానుల సభ రసాభాస

నెల్లూరు (దర్గామిట్ట) : అభిమానులు వేదికముందుకు వచ్చి హంగామా చేయడంతో సభ రసాభాసగా మారింది. చిరంజీవి ప్రసంగించే సమయంలో గందరగోళం చెలరేగి తోపులాటకు దారితీసింది. చాలామంది ఎలాగోలా తప్పించుకుని సభ నుంచి బయటపడ్డారు. సభ ప్రారంభంలో హాలు మొత్తం నిండింది. తోపులాటతో చిరంజీవి ప్రసంగించే సమయంలో వేదిక ముందు నాలుగైదు వరుసలు తప్ప హాల్ అంతా ఖాళీగా కనిపించింది. అభిమానులను కట్టడి చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారు. కార్యక్రమం మొదలైన పావుగంట తర్వాత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, ఆయన సోదరుడు విజయకుమార్‌రెడ్డితో కలిసి వేదికపైకి వచ్చి చిరంజీవికి శాలువా కప్పి ఆలింగనం చేసుకున్నారు.

చిరంజీవి తొలుత పలువురు మహిళలకు కుట్టుమిషన్లు, చీరలు, వికలాంగులకు ట్రైసైకిళ్లుపంపిణీ చేశారు. జాతీయస్ధాయి స్కేటింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన నెల్లూరు బాలికలకు ప్రశంతాపత్రాలు, షీల్డులు బహూకరించారు. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం లక్ష మొక్కలను పంపిణీ చేయనున్నట్లు ఈ సందర్భంగా చిరంజీవి యువత గౌరవ అధ్యక్షుడు ముక్కాల ద్వారాకనాథ్ తెలిపారు. చిరంజీవి స్ఫూర్తితో తన దేహాన్ని కూడా దానం చేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి చిరంజీవి వెంట ఉన్నారు. చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి, నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు, రవీంద్ర, మునిగిరీష్, నన్నేసాహెబ్, చింతాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

దిశ మారిన ‘థానే’

థానే తుపాను దిశ మారింది. అయినా జిల్లాను భయం వీడడం లేదు. చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న థానే తుపాను దిశ గురువారం సాయంత్రానికి మారింది. కడలూరు-పాండిచ్చేరి వైపుగా పయనిస్తోంది. తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని, జిల్లాలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. థానే ప్రభావంతో జిల్లాలో * కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. అధికారులు పలు చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రజలను అప్రమత్తం చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి.

నెల్లూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి : రెండు రోజుల కన్నా గురువారం అలల ఉద్ధృతి ఎక్కువయ్యింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. తీరప్రాంతమంతా బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. రాత్రి పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. వాకాడు మండలం తూపిలిపాళెం, కోట మం డలం కొత్తపట్నం, శ్రీనివాససత్రం వద్ద సముద్రం 40-50 మీటర్లు ముందుకు వచ్చింది. వావిళ్లచెరువు, కొత్తపట్నం గ్రామాల్లో 50 ఎకరాల వరినారుమళ్లను సముద్రపు నీరు ముంచెత్తింది. బోగోలు, కావలి మండలాలలో తీరాన ఉంచిన పడవలు, వలలు దెబ్బతిన్నాయి. ఒక్క బోగోలు మండలం తాటిచెట్లపాళెం వద్ద 20 బోట్లు, 30కి పైగా వలలు దెబ్బతినడంతో రూ. 50 లక్షలు నష్టం జరిగి ఉంటుందని అధికారులఅంచనా.

కావలి మండలం లక్ష్మీపురం వద్ద బకింగ్‌హాం కెనాల్‌కు గండి పడటంతో 200 ఎకరాల్లో వరి పంటను సముద్రపు నీరు ముంచెత్తింది. చిప్పలేరు క్రీక్ దగ్గర బ్యాక్‌వాటర్ కారణంగా కెనాల్‌కు గండిపడినట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద థానే తుపాను కారణంగా జిల్లాలో రెండు కోట్ల రూపాయల మేర ఆస్తి, పంట నష్టం జరిగి ఉంటుందని సమాచారం. వాకాడు మండలంలో సముద్రతీరాన్ని ఆనుకుని ఉన్న మూడు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ ప్రతిఘటించారు. అలాగే చిల్లకూరు మండలం తూర్పుకనుపూరు, గుమ్మళ్లదిబ్బ గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చేందుకు ప్రజలు అంగీకరించలేదు. చిల్లకూరు వద్ద తమిళనాడుకు చెందిన 20 బోట్లు తీరానికి చేరాయి. కృష్ణపట్నం పోర్టు దగ్గర మూడో నెంబరు ప్రమాదసూచికను ఎగురవేశారు.

వణుకుతున్న తీరం

కావలి : థానే తుపాన్ కావలి తీరాన్ని వణికిస్తోంది. కావలి మండలంలోని లక్ష్మిపురం మత్స్యకార గ్రామంను ఆనుకొని ఉన్న బకింగ్‌హామ్ కెనాల్‌కు గండి పడడంతో సుమారు 200 ఎకరాల వరి పైరు నీట మునిగింది. సుమారు 40 వలలు, 15 బోట్లు అలల ఉద్ధృతికి దెబ్బతినడంతో సుమారు *30 లక్షల నష్టం వాటిల్లింది. తీరంలోని లక్ష్మీపురం గ్రామ సముద్ర జలాల్లో గురువారం వేకువన ఓ ఫైబర్ బోటులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు గల్లంతయ్యారని సమాచారం. వారిని ప్రకాశం జిల్లాకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి కృష్ణపట్నం పోర్టు అధికారులకు స్థానిక పోలీసులు సమాచారం అందించారు.

గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చేపట్టారు. కావలి మండల తుపాన్ ప్రత్యేకాధికారులు, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ క్రిష్ణకిషోర్‌రెడ్డి మండలంలోని తీరప్రాంతంలో పర్యటిస్తూ, మత్స్యకారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. ప్రతి గ్రామానికి ఓ వీఆర్వోని, ఓ పోలీసు కానిస్టేబుల్‌ను ఉంచి పర్యవేక్షిస్తున్నారు.

బ్యాక్ వాటర్‌తో తెగిన బకింగ్ హాం కెనాల్

సముద్రం నుంచి వస్తున్న బ్యాక్ వాటర్‌తో మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో బకింగ్‌హాం కెనాల్‌కు గండి పడింది. బకింగ్‌హామ్ కెనాల్‌లోని ఉప్పు నీరంతా పంట పొలాల్లోకి చేరింది. సుమారు 200 ఎకరాల వరి పొలాలు బకింగ్‌హామ్ కెనాల్ నుంచి వచ్చిన నీటితో మునిగాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. కావలి డివిజన్‌లోని తీరప్రాంత మండలాలైన కావలి, అల్లూరు, బోగోలు, విడవలూరు తదితర మండలాల్లో పరిస్థితిని కావలి ఆర్డీవో మద్దా వెంకటేశ్వర్లు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

80మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం

బిట్రగుంట : ‘థానే’ తుపాన్ తూర్పుతీరాన్ని అల్లకల్లోలం చేసింది. ఉవ్వెత్తున్న ఎగసిపడుతున్న అలలు, భారీ ఈదురుగాలులతో కడలి ఉగ్రరూపం దాల్చింది. సునామీని గుర్తుచేసేలా తీరాన్ని కబలిస్తూ ముందుకు చొచ్చుకువస్తొంది. తాటిచెట్లపాళెం తీరం వద్ద గురువారం వేకువ నుంచి పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. 6 నుంచి 10మీటర్ల ఎత్తులో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. సుమారు 80మీటర్లు సముద్రం ముందుకు చొచ్చుకువచ్చింది. సునామీని సైతం తట్టుకొని నిలదొక్కుకున్న సముద్రపు ఒడ్డు థానే తాకిడికి నామరూపాల్లేకుండా పోయింది. కట్టపై ఉన్న తాటిచెట్లు కూడా అలల ఉధృతికి నేలకు వాలి సముద్రంలో కలసిపోయాయి. తీరానికి 100మీటర్లకు పైగా దూరంలో ఉన్న ఫిష్‌ల్యాండిగ్ సెంటర్‌ను సముద్రపు నీరు ముంచెత్తింది. స్థానిక మత్స్యకారులు కరిపెంగారి రమణయ్య, వాయిల తాతాయ్య, మేకల గోవిందు, వాయిల గోపాల్, తులసి బాబు, తులసి నరసింహులు, ప్రళయకావేరి శ్రీనివాసులు, వాయిల చెంచయ్య, తదితరులకు చెందిన 50 ఫైబర్ పడవలు, 50వలలు అలల తీవ్రత కారణంగా దెబ్బతిన్నాయి.

వీటి విలువ సుమారు రూ. 50లక్షలు ఉంటుందని స్థానికుడు ప్రళయకావేరి శ్రీనివాసులు తెలిపారు. మరో 50కిపైగా డిస్కో వలలు ఇసుకలో కూరుకుపోయాయి. వలలు, పడవ లు కాపాడుకునేందుకు నానాఅవస్థలు పడుతున్నారు. ఇసుకలో కూరుకుపోయిన వలలను అతికష్టం మీద తీరానికి దూరంగా తరలిస్తున్నా రు. గురువారం వేకువన ఒక మోస్తరుగా ఉన్న అలలు ఆరు గంటల ప్రాంతంలో ఉవ్వెతున్న ఎగసి పడ్డాయి. ఆరు నుంచి 10మీటర్ల ఎత్తులో అలలు తీరాన్ని కబలిస్తూ 11 గంలవరకూ ఆందోళన కలిగించాయి. 11 నుంచి 12వరకూ కొద్దిగా శాంతించిన సముద్రుడు 12.30 ప్రాం తంలో మరోసారి విజృంభించాడు. సాయంత్రం వరకూ అలల ఉధృతి తగ్గే అవకాశం కని పించకపోవడంతో మత్స్యకారులు దేవుడిపై భారం వేసి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు.

అధికారుల అప్రమత్తం

థానే ప్రభావంతో తీరంలో పరిస్థితులు తారుమారు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్ సహాయక చర్యల ప్రత్యేకాధికారి, గృహనిర్మాణశాఖ పీడీ వెంకటేశ్వరరెడ్డి, బిట్రగుంట ఎస్సై ఖాజావలి, రెవెన్యూ, ఇంజనీరింగ్ సిబ్బంంది తీరంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. తీరంలోని మత్స్యకార గ్రామాల్లో పోలీసు, రెవెన్యూ సిబ్బందిని కాపలాగా ఉంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు.


29, డిసెంబర్ 2011, గురువారం

షిండేతో సీఎం కిరణ్ భేటి

న్యూఢిల్లీ: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని షిండే దృష్టికి సీఎం తీసుకువచ్చారు. రాష్ట్రానికి అదనపు విద్యుత్‌ను కేటాయించాలని సీఎం విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. అయితే సీఎం కిరణ్ ప్రతిపాదనల్ని పరిశీలిస్తామని షిండే హామీ ఇచ్చారు. ఇప్పటికే 240 మెగావాట్ల విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించామని, అదనపు విద్యుత్‌ను మార్చి నెల వరకు కొనసాగిస్తామన్నారు.

'మూడు' కోసం చిరంజీవి బెట్టు

Chiranjeevi

తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మూడు మంత్రి పదవుల కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. కేబినెట్‌లో చిరు వర్గంలోని ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అధిష్టానం సుముఖత వ్యక్తం చేసిందట. అయితే చిరు మాత్రం ముగ్గురుకి కావాలని కోరుతున్నారట. మూడు ప్రాంతాల నుండి ముగ్గురుకి పదవులు ఇస్తే తన వర్గానికి లబ్ధి చేకూరుతుందని ఆయన అభిప్రాయపడుతున్నట్లుగా సమాచారం. అందుకే ఆయన మూడు పదవుల కోసం అధిష్టానం వద్ద ప్రయత్నిస్తున్నారట. కానీ అధిష్టానం మాత్రం రెండింటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.

మంత్రివర్గంలో ఇద్దరికి చోటు కల్పించడం ద్వారా చిరు ఆశలు నెరవేర్చే దిశలో అధిష్టానం నిర్ణయం తీసుకున్నప్పటికీ మూడో పదవి విషయమే ఆయనను కొంత ఆసంతృప్తికి గురి చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అధిష్టానం ఇచ్చిన రెండు మంత్రి పదవులు సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావులకు కేటాయించే అవకాశముంది. ఉద్యమం నేపథ్యంలో తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇవ్వాలని చిరు భావిస్తున్నారట

లాలూని ‘జాతీయ వ్యక్తి’గా ప్రకటించాలి: శతృఘ్న

న్యూఢిల్లీ: జాతీయ పక్షి నెమలి వలే... ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను కూడా ‘జాతీయ వ్యక్తి’గా ప్రకటించాలని బీజేపీ ఎంపీ, సినీనటుడు, షాట్‌గన్ శతృఘ్నసిన్హా లోకసభలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. జీరో అవర్ సందర్బంగా రాజ్యంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో భోజ్‌పురి భాషను చేర్చాలని సిన్హా డిమాండ్ చేశారు. భోజ్‌పురి భాషను లాలూ ప్రసాద్ యాదవ్‌తోపాటు... రాజేంద్ర ప్రసాద్, జయప్రకాశ్ నారాయణ్, బాబు జగ్జీవన్‌రామ్, మారిషస్ జాతిపిత సర్ సీవూసాగర్ రామ్‌గూలమ్ లాంటి ప్రముఖులు మాట్లాడేవారని తన ప్రసంగంలో తెలిపారు.

దేశ, విదేశాల్లో లాలూకు విశేష గుర్తింపు ఉందని.. పాకిస్థాన్‌లో లాలూ ప్రసాద్‌కు పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఉన్నారని అన్నారు. రాజ్యాంగంలో భోజ్‌పురిని చేర్చడం.. లాలూని జాతీయ వ్యక్తిగా ఎంపిక చేయడం ఒకేసారి జరుగాలని సిన్హా అనగానే సభలో పెద్ద పెట్టున నవ్వులు విరిసాయి. సభ్యులు బల్లలపై కొడుతూ.. హర్షం ప్రకటించారు. ప్రధాని మన్మోహన్, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ పెద్ద పెట్టున నవ్వుతూ కనిపించారు.

సీల్డ్ కవర్ ద్వారానే డిప్యూటీ మేయర్ ఎంపిక: పిసిసి

hyderabad

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్‌ను సీల్డ్ కవర్ ద్వారానే ఎంపిక చేస్తామని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ గురువారం ప్రకటించింది. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కాంగ్రెసు కార్పోరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్పోరేటర్లంతా పిసిసి చీఫ్ బొత్సకు ఎంపిక బాధ్యతను అప్పగించారు. జనవరి మూడో తేదిన ఈ ఎంపిక ఉంటుంది. జిహెచ్ఎంసి పరిధిలోని కాంగ్రెసు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేందుకు ఇద్దరు సభ్యులను నియమించారు. వీరు ప్రజాప్రతినిధులు అందర్నీ కలిసి అభ్యర్థిత్వంపై వారి నిర్ణయాలు తీసుకొని ఓ నివేదిక తయారు చేసి బొత్సకు అందజేస్తారు.

ఈ నివేదికలోని అంశాలను సిఎం కిరణ్ కుమార్ రెడ్డితో చర్చించి ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటారు. కాగా హైదరాబాద్‌కు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అభ్యర్థులకే డిప్యూటీ మేయర్ పదవి కట్టబెట్టాలని అడుగుతున్నారని సమాచారం. అయితే ఏడాదికి ఒకరు చొప్పున ఇద్దరు కార్పోరేటర్లకు ఆ పదవి కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఎంఐఎంతో ఒప్పందం మేరకు వచ్చే రెండు సంవత్సరాలు మేయర్ పదవిని వారికి ఇవ్వాల్సిన నేపథ్యంలో ఇటీవల కార్తీక రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

రీఎంబర్స్‌మెంట్‌పై వైఎస్‌ఆర్‌సీపీ ధర్నా

హైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీఎంబర్స్‌మెంట్ కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖం పూరించింది. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 4 తేది నుంచి భారీ స్థాయిలో ఆందోళనలు, ధర్నాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.

ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై నిర్వహిస్తున్న ‘ఫీజు ధర్నా’ పోస్టర్‌ను గురువారం ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీనేతలు కొణతాల రామకృష్ణ, పుత్తా ప్రతాప్‌రెడ్డిలు విడుదల చేశారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో హైదరాబాద్‌లో ఫీజు ఫోరు దీక్ష చేసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల్లో కదలిక తేవడానికి రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం కార్యక్రమాల్ని చేపడుతోంది.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయానికి తిలోదకాలిచ్చిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగడుతోంది. ఇందులో భాగంగానే వచ్చే నెల నాలుగో తేదిన అన్ని జిల్లా కలెక్టరేట్‌ల ముందు ఫీజు ధర్నా పేరుతో పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు నిర్వహించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.












తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్: అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పడిపోవడంతో మన మార్కెట్‌లో కూడా ధరలు కొంత మేరకు తగ్గాయి. ప్రస్తుతం బంగారం 404 రూపాయలు నష్టపోయి.. 26,877 రూపాయలకు సమీపంలో, ఎంసీఎక్స్ మార్కెట్‌లో కేజీ వెండి 1125 రూపాయలు పతనమై 49, 511 వద్ద ట్రేడ్ అవుతోంది

మరోసారి నాటkaమా?: కెసిఆర్‌పై జగన్ పార్టీ నేతల ఫైర్

Gone Prakash Rao

హైదరాబాద్/విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు గురువారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. కెసిఆర్ దీక్ష పేరుతో మరోసారి నాటకానికి తెరదీశారని గోనె ప్రకాశ రావు ధ్వజమెత్తారు. సెంటిమెంటును అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధి కోసం యువత, విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆఢుకోవద్దని హితవు పలికారు. 2009 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 10 వరకు ఆసుపత్రుల్లో కెసిఆర్ చేయించుకున్న ట్రీట్‌మెంట్ వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు. వాటిని మూడు రోజుల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతానన్నారు. టిఆర్ఎస్ బలోపేతమైనంత మాత్రాన తెలంగాణ రాదని జాతీయ పార్టీలతోనే అది సాధ్యమన్నారు.

కెసిఆర్ దీక్ష పేరుతో మరోసారి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవాలని చూస్తున్నారని మాజీ మంత్రి మారెప్ప విశాఖపట్నంలో అన్నారు. ఉద్యమం పేరుతో విద్యార్థులను బలి చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో వైయస్ రాజశేఖర రెడ్డి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఉద్యమం పేరుతో కెసిఆర్, ఫీజు రీయింబర్సుమెంట్సు ఇవ్వక ప్రభుత్వం విద్యార్థుల

రంజీ క్వార్టర్‌కు హైదరాబాద్ జట్టు ఎంపిక

హైదరాబాద్: రంజీ ట్రోఫి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు హైదరాబాద్ జట్టును హెచ్‌సీఏ ప్రకటించింది. జనవరి 2 తేదిన జరిగే నాలుగురోజుల నాకౌట్ మ్యాచ్‌లో రాజస్థాన్జట్టుతో హైదరాబాద్ తలపడనుంది. హైదరాబాద్ జట్టుకు రవితేజ నాయకత్వ వహించనున్నారు.

హైదరాబాద్ జట్టు: డీబీ రవితేజ (కెప్టెన్), అశోక్‌రెడ్డి, సుమన్, అర్జున్ యాదవ్, సందీప్, అహ్మద్ ఖాద్రీ, ఇబ్రహీం ఖలీల్, కనిష్క్ నాయుడు, అన్వర్ అహ్మద్ ఖాన్, లలిత్ మోహన్, మెహదీ హసన్, పరమ్‌వీర్ సింగ్, విశాల్ శర్మ, ఖాదర్, శంషాంక్ నాగ్. సునీల్ జోషి (కోచ్)

కీలక దశకు ఉద్యమం: కెసిఆర్ నోటి నుండి అదే పాట

K Chandrasekhar Rao

మహబూబ్ నగర్: తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్లీ పాత పాటే పాడారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన పోరు యాత్రకు కెసిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యమం కీలక దశకు చేరుకుందన్నారు. సంక్రాంతి తర్వాత మలి విడత ఉద్యమం ప్రారంభమవుతుందన్నారు. జనవరి 17వ తేదిన ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాజకీయ సందర్భం వచ్చినప్పుడల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్యమం ఏరూపంలో ఉన్నా ప్రజల సహకారం అవసరమన్నారు. వెన్నెముకలేని రాజకీయ నాయకులే తెలంగాణకు శాపంగా మారారన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుమ్మక్కై విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. ముందు ముందు ఉద్యమం భయంకరంగా ఉంటుందన్నారు. కేంద్రం ప్రజాస్వామిక ఆకాంక్షను గౌరవించడం లేదన్నారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం కావాలన్నారు. తెలంగాణ ఇప్పుడు సాధించుకోకుంటే కట్టుబానిసలుగా మారాల్సి వస్తుందన్నారు. పదకొండేళ్లుగా సహనంతో ఉద్యమిస్తున్నామని, రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యమన్నారు. కాగా పలువురు కాంగ్రెసు, టిడిపి కార్యకర్తలు కెసిఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు కూడా నష్టపోతున్నాయి. గ్లోబల్‌ సంకేతాలు ప్రతికూలంగా రావడంతో గురువారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈవాళ డిసెంబరు ఫ్యూచర్స్‌ ఎక్స్‌పైరీ ఉండటం కారణంగా మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉంటాయని భావిస్తున్నారు. నిఫ్టీకి 4,640 కీలక సపోర్ట్‌ లెవల్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


కిరణ్ రాజీవ్ యువకిరణాలు, కెసిఆర్‌పై రేవంత్ విసుర్లు

Revanth Reddy

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లక్ష ఉద్యోగాలపై ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కే అనుమానం వచ్చిందని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి గురువారం విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన రాజీవ్ యువకిరణాలపై రేవంత్ విమర్శలు గుప్పించారు. డిసెంబర్ నెలాఖరులోగా లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మరో మూడు రోజుల్లోగా ఆ ఉద్యోగాలను ఎక్కడి నుండి తీసుకు వచ్చి ఇస్తారని ప్రశ్నించారు. నిరుద్యోగులను ప్రభుత్వం మభ్య పెడుతోందని విమర్శించారు.

కిరణ్ తన వ్యక్తిగత ప్రచారం కోసమే లక్ష ఉద్యోగాలు ప్రకటించారన్నారు. ఈ పథకం నిరుద్యోగులను నిరుత్సాహానికి గురి చేస్తుందన్నారు. ప్రజా ధనాన్ని కాంగ్రెసు ప్రభుత్వం తీవ్రంగా దుర్వినియోగం చేస్తుందని ధ్వజమెత్తారు. ఉద్యోగాలపై సిఎం ఢిల్లీలో ప్రకటించిన తర్వాతే రాష్ట్రానికి రావాలన్నారు. తమను కుక్కలతో పోల్చిన కెసిఆర్ నక్కలా తెలంగాణ ప్రజలను వంచించారని విమర్శించారు.

'చిరు'తో సరిపెట్టండి!: సిఎం ఆశలపై మళ్లీ నీళ్లేనా?

kiran kumar reddy

న్యూఢిల్లీ: బుధవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ బిజీ బిజీగా కనిపిస్తున్నారు. కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, చిదంబరంలతో గంటన్నరకు పైగా చర్చలు జరిపారు. చిరంజీవి, తెలంగాణ ఉప ఎన్నికలు, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాల పైనే పార్టీ ముఖ్య నేతలతో సిఎం చర్చిస్తున్నట్లుగా సమాచారం. పలువురు ఎంపీలు కూడా సిఎంతో భేటీ అయ్యారు. ఉప ఎన్నికలు జరగబోయే నియోజకవర్గాల ఎంపీలతో సిఎం ప్రత్యేకంగా మాట్లాడినట్లు సమాచారం. గెలుపోటములు, అభ్యర్థుల అంశంపై మాట్లాడినట్లుగా తెలుస్తోంది.

సిఎం అధిష్టానం వద్ద మంత్రివర్గ విస్తరణకు పట్టుబడుతున్నట్లుగా సమాచారం. కిరణ్ ఎప్పటి నుండో తనకు అనుకూలమైన వారితో మంత్రివర్గ విస్తరణ చేయాలనే ఆశతో ఉన్నారు. అయితే ప్రతిసారి అధిష్టానం ఆయన ఆలోచనలకు చెక్ చెబుతోంది. ఈసారి ఎలాగైనా అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకోవాలని చూస్తున్నారు. ఇందు కోసం నేతల వద్ద తన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం కేవలం చిరంజీవి వర్గం ఎమ్మెల్యేలకు మాత్రమే కేబినెట్లో అవకాశం ఇవ్వడంతో సరిపెట్టాలని సూచిస్తున్నట్లుగా సమాచారం.

బుధవారం సాయంత్రమే కిరణ్ తిరిగి వస్తారనుకున్నప్పటికీ ఆయన మరికొందరు నేతలను కలవడానికి శుక్రవారం సాయంత్రం వరకు అక్కడే ఉండనున్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవనున్నారు. ఢిల్లీ చేరుకున్నాక గురువారం రాత్రి కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి గురువారం ఉదయం కూడా భేటీ అయ్యారు. సాయంత్రం కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉన్నందున ఆంధ్ర ప్రదేశ్‌కు అదనపు విద్యుత్ ఇవ్వాలని విజ్ఢప్తి చేశారు. సిఎం విజ్ఞప్తిని పరిశీలిస్తామని షిండే ఆ తర్వాత విలేకరులతో చెప్పారు.

గాలి, శ్రీనివాసరెడ్డిల రిమాండ్ పొడిగింపు

హైదరాబాద్ : ఓఎంసీ కేసులో గాలి జనార్దనరెడ్డి, శ్రీనివాసరెడ్డిల జ్యుడిషియల్ రిమాండ్ ను జనవరి 12వ తేదీ వరకూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంపొడిగించింది. చంచలగూడ జైల్లో ఉన్న వీరిని న్యాయమూర్తి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపారు.

కాగా తన తల్లి వర్థంతికి హాజరయేందుకు రెండు రోజులు అనుమతి ఇవ్వాలంటూ గాలి జనార్దనరెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో బళ్లారిలో జరిగే ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు అనుమతి కోరుతూ వేసిన ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది

ఢిల్లీలో హీటెక్కిన స్టేట్ పాలిటిక్స్, సిఎంతో టి-ఎంపీలు

Kiran Kumar Reddy

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర రాజకీయాల వేడి రాజుకుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన రాత్రి గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయి పలు విషయాలు చర్చించారు. గురువారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా పలువురితో సమావేశమవుతారు. సిఎం పర్యటనతో ఢిల్లీలో రాష్ట్ర రాజకీయాల వేడి రాజుకుంది. ఇటీవల మద్యం సిండికేట్లపై జరిగిన దాడిపై ఆయన అధిష్టానంతో చర్చించే అవకాశముంది. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను టార్గెట్ చేసుకొనే సిఎం సిండికేట్లపై దాడులు జరిగినట్లు పుకార్లు వినిపించిన విషయం తెలిసిందే. అలాగే తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వర్గం ఎమ్మెల్యేలకు కేటాయించవలసిన మంత్రి పదవులపై, తెలంగాణలోని ఉప ఎన్నికలపై సిఎం అగ్రనేతలతో చర్చిస్తున్నారు.

కాగా సిఎం కిరణ్‌తో రాష్ట్రానికి చెందిన పలువురు పార్లమెంటు సభ్యులు భేటీ అయ్యారు. నిత్యం ఆయనపై విరుచుకు పడే తెలంగాణ ఎంపీలు కూడా కలిసిన వారిలో ఉన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, మందా జగన్నాథం, అంజన్ కుమార్ యాదవ్, బలరాం నాయక్, రాజయ్య, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, కనుమూరి బాపిరాజు ఆయనను కలిశారు.

హోం > తాజా వార్తలు అక్కినేని అన్నపూర్ణ అంత్యక్రియలు పూర్తి

హైదరాబాద్ : అక్కినేని నాగేశ్వరరావు సతీమణి అక్కినేని అన్నపూర్ణ అంత్యక్రియలు గురువారం పూర్తయ్యాయి. కుమారులు అక్కినేని వెంకట్, నాగార్జున, మనవడు సుమంత్‌లు చితికి నిప్పంటించారు. మొదట అన్నపూర్ణ స్టూడియోస్‌కు అన్నపూర్ణమ్మ భౌతిక కాయాన్ని తరలించి, అక్కడి నుంచి ఇఎస్ ఐ శ్మశాన వాటికకు తీసుకొచ్చారు.

అత్యంత సన్నిహితులు మినహా లోపలికి ఎవ్వరినీ అనుమతించలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న అన్నపూర్ణ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున అన్నపూర్ణను కడసారి చూసేందుకు తరలివచ్చారు. ఓదార్పు యాత్ర పూర్తి చేసుకున్న ఈ ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన వైఎస్‌ జగన్‌ అక్కినేని కుటుంబాన్ని స్వయంగా వెళ్లి సంతాపం తెలియజేశారు.

రామ్‌చరణ్ పూర్తి చేస్తాడు, పదవి ఏదైనా ఓకే: చిరంజీవి

chiranjeevi

నెల్లూరు: మిగిలిన తన సినీ ప్రస్థానాన్ని తన తనయుడు రామ్‌చరణ్ తేజ పూర్తి చేస్తాడని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి గురువారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్నారు. కాంగ్రెసు పార్టీ ఏ పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదన్నారు. ఏ పదవి ఇచ్చినా స్వీకరించి పార్టీ కోసం పని చేస్తానన్నారు. తాను పదవి కోసం ఎప్పుడూ పాకులాడదేలన్నారు. తన బలం, బలహీనత రెండూ అభిమానులేనని ఆయన అన్నారు.

కాగా చిరంజీవి వర్గం శాసనసభ్యులకు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో రెండు పదవులు ఇచ్చేందుకు అధిష్టానం సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సిఎం కిరణ్ తన ఢిల్లీ పర్యటనలో చిరు వర్గానికి మంత్రి పదవుల అంశంపై కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.

వీఆర్వో దరఖాస్తు స్వీకరణకు నేటితో గడువు పూర్తి

హైదరాబాద్:వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల దరఖాస్తు స్వీకరణకు గురువారంతో గడువు ముగియనుంది. ఫీజు కట్టడానికి మంగళవారంతో గడువు ముగిసిన విషయం విదితమే. రెండు పోస్టులకు కలిపి బుధవారం వరకు 8.7 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.

నయనతారపై వర్మ ‘మండోదరి’ ప్లాన్

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తర్వలో తాను ‘రామాయణం’ సినిమా తీస్తున్న ప్రకటించిన విషయం తెలిసిందే. తన తీయబోయేది మోడ్రన్ రామాయణ సినిమా అని, అందులో నాగార్జునను ‘రావణుడి’ పాత్రలో చూపించబోతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు కూడా. అయితే ఇదంతా వర్మ పబ్లసిటీ స్టంట్ అని అనుకున్నప్పటికీ.... వర్మ మాత్రం ఈ ప్రాజెక్టుపై సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. నాగార్జున మీడియా ముందు తనది రావణుడి పాత్ర అని ఒప్పుకోక పోయినా...ఎట్లాగయినా నాగార్జునను కన్విన్స్ చేయగలననే ధీమాతో వర్మ ఉన్నాడు. ఇక పోతే నాగార్జున సరసన నయన తారను మండోదరి పాత్రలో డిసైడ్ చేసిన వర్మ ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు జరిపాడని, నయన తార నుంచి కూడా సానుకూల స్పందనే వచ్చిందని తాజా సమాచారం.

శ్రీరామరాజ్యం సినిమాలో సీతగా అద్భుతమైన నటన కనబర్చిన నయన తార...తాజాగా ఈ పాత్రకు ఒప్పకున్నట్లు వస్తున్న వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అసలు శ్రీరామరాజ్యం సినిమా తర్వాత సినిమాలకు దూరం అని చెప్పిన నయన తార మళ్లీ రూటు మార్చడం ఏమిటి? అందులోనూ మండోదరి పాత్రలో... ప్రభుదేవ ఎలా ఒప్పుకున్నాడనే వార్తలు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి..

కాగా...త్వరలోనే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా గురించి ప్రెస్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. మరి ఈవార్తల్లో నిజమెంతో....సినిమా ప్రారంభమయ్యే వరకు నమ్మడం కష్టం సుమీ.

జనవరి 2న అన్నా కోర్ కమిటి సమావేశం

ముంబై: కోర్ కమిటీ సమావేశం జనవరి 2 తేదిన రాలేగావ్ సిద్ధిలో జరుగుతుందని అన్నా హజారే బృందంసభ్యుడు మీడియాకు వెల్లడించారు. జనవరి 2 తేదిన జరిగే సమావేశంలో లోక్‌పాల్ బిల్లుపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పటిష్టమైన లోక్‌పాల్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలంటూ.. ప్రభుత్వ బలహీన లోక్‌పాల్ బిల్లుకు వ్యతిరేకంగా ముంబైలో చేపట్టిన దీక్షను అనారోగ్య కారణంతో అర్ధాంతరంగా ముగించుకొని, స్వగ్రామం రాలేగావ్ సిద్ధికి హజారే చేరుకున్న సంగతి తెలిసిందే.

బ్యాటింగ్ లో వైఫల్యంవల్లే ఓడాం: ధోనీ

మెల్‌బోర్న్: బ్యాటింగ్‌లో వైఫల్యం వల్లే ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఓడిపోయామని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పేర్కొన్నాడు. రెండు ఇన్నింగ్స్‌లోనూ తమ బ్యాటింగ్ ఘోరంగా ఉందని మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. మొదటి టెస్ట్‌లో ఆసీస్ చేతిలో 122 పరుగుల తేడాతో ఓడిపోవడం పట్ల ధోనీ అసంతృప్తి వ్యక్తం చేశాడు

ఈ‌సారి కొడతాడంటున్న మోహన్‌ బాబు

తన కుమారుడు విష్ణు ఈ సారి తప్పకుండా హిట్ కొడతాడంటున్నారు సినీయర్ నటుడు మోహన్ బాబు. విష్ణ, హన్సిక జంటగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ సమర్పణలో 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఓ వినోద భరితమైన చిత్రాన్ని నిర్మించబోతోంది. జనవరి 5న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభ కానున్న నేపథ్యంలో మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ విష్ణు కెరీర్లోనే అద్భుతమైన హిట్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం, చక్రి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని నాలుగు పాటలు ఇప్పటికే రికార్డు చేయడం పూర్తయిందన్నారు. 2012లో ఈ సినిమా తమ బేనర్ లో మంచి విజయాన్ని సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
mohan babu

లక్ష్మి ప్రసన్న నిర్మాతగా రూపొందుతున్న ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రం కూడా మనోజ్ కెరీర్ లో మంచి హిట్ గా నిలుస్తుందని, బయటి బ్యానర్లో మనోజ్ నటిస్తున్న మిస్టర్ నోకియా చిత్రం కొత్త సంవత్సరంలో ఘన విజంయ సాధిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఈ చిత్రానికి తెరవెనక కోన వెంకట్, సుద్దాల అశోక్ తేజ, భాస్కర భట్ల, రామజోగ్య శాస్త్రి, గోపీ మోహన్, మరుధూరి రాజా, చక్రి, సిద్దార్థ, వర్మ, సెల్వ, రఘు కులకర్ణి, సురేష్ బాబు, అట్లూరి, నరసింహ, రతన్, విజయ్ తదితరులు పని చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్. వంశీ కృష్ణ, నిర్మాత : మంచు విష్ణు, దర్శకత్వం : జి. నాగేశ్వరరావు

బిజినెస్ వర్కౌట్ అయితే మహేష్ బాబే నెం.1?

మోగాస్టార్‌గా, టాలీవుడ్ నెం.1 గా తెలుగు తెరను ఏలిన చిరంజీవి సిసినిమాలకు దూరమై రాజకీయాల బాట పట్టడంతో ‘టాలీవుడ్ నెం.1’ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. చిరంజీవి మెగాస్టార్ గా మారడానికి కారణం అనేక కమర్షియల్ హిట్లు, అనేక సార్లు బాక్సీఫీసు రికార్డులు బద్దలు కొట్టడం, ఆకట్టుకునే నట, దుమ్మురేపే స్టెప్పులు.

ఇప్పడు ఆ బిరుదు కోసం తెలుగులో మహేష్ బాబు, పవన్ కళ్యాన్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే ఈ ముగ్గురు హీరోలూ హిట్లు, ప్లాపులతో ఎగుడు దిగుడుగా ప్రయాణం సాగిస్తుండటంతో ఏ ఒక్కరు కూడా ఆ స్థానాన్ని ఇప్పటి వరకు చేరుకోలేక పోయారు.
mahesh babu

తాజాగా దూకుడు సినిమా భారీ విజయంతో దూకుడుగా ఉన్నమహేష్ బాబు నెంబర్. 1 స్థానాన్ని దక్కించుకోవడానికి సంక్రాంతి బరిలోకి దూకాడు. దూకుడుతో మిస్సయిన ఇండస్ట్రీ రికార్డులను‘బిజినెస్ మేన్’ సినిమా ద్వారా దక్కుతుందని ఇటు అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఏది ఏమైనా బిజినెస్ మ్యాన్ బిజినెస్ పరంగా వర్కౌట్ అయితే మాత్రం దాదాపు నెం.1 స్థానం దక్కడం ఖాయం అంటున్నారు.

అయితే తర్వలో జూనియర్ ఎన్టీఆర్ ‘దమ్ము’, పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’తో ఎంట్రీ ఇస్తున్నారు. మరి ఈ సినిమాలు ఏమైనా అద్భుతాలు సృష్టిస్తే చెప్పలేం కానీ...లేక పోతే మాత్రమ మహేష్ బాబే నెం.1 అని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Support Casa LA

మహేష్ బాబు ‘మగాడు’ అంటూ హల్ చల్..!

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘మగాడు’ అనే టైటిల్ తో సినిమా వస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సినిమాను సి.కళ్యాన్, సింగనమల రమేష్ మణిశర్మ సంగీత దర్శకత్వంలో నిర్మించబోతున్నట్లు అంతా చర్చించుకున్నారు. ఖలేజా భారీ ప్లాపు కావడం... సి.కళ్యాన్, సింగనమల వివిధ పోలీసు కేసుల్లో ఇరుక్కోవడంతో ఈ సినిమా అటకెక్కింది. మహేష్ బాబు, త్రివిక్రమ్ ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం మహేష్ బిజినెస్ మ్యాన్, ఆతర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో బిజి షెడ్యూల్ తో ఉంటే, త్రివిక్రమ్ శ్రీనివాస్ Mahesh Babuఅల్లు అర్జున్-ఇలియాన జంటగా ఓ సినిమాను రూపొందిస్తున్నారు.

అప్పుడెప్పుడో కరుమరుగైన మహేష్ బాబు ‘మగాడు’ తాజాగా నెట్లో హల్ చల్ చేస్తోంది. 2012లో ఆ సినిమా విడుదల కాబోతోందంటూ ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే దీనిపై మహేష్, త్రివిక్రమ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అభిమానులే కావాలని మహేష్ బాబు ‘మగాడు’ను లైమ్ లైట్లోకి తెస్తున్నారని అనుమానిస్తున్నారు.

కడప దర్గాను సందర్శించిన నటి స్నేహ


కడప: సినీ నటి స్నేహ కడప పెద దర్గాను గురువారం సందర్శించింది. కాబోయే వరుడు ప్రసన్నతో కలిసి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. వచ్చే ఏడాది మే నెలలో పెళ్లి జరిగే అవకాశమున్నట్టు స్నేహ తెలిపారు. స్నేహ దర్గా సందర్శనకు వచ్చిందని తెలుసుకున్న అభిమానులు, ఆమెన చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

‘బిజినెస్ మేన్‌’లో ఆ పాట కాపీనా..?

మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘దూకుడు’ సినిమా ఆడియోతో పాటు సినిమా కూడా భారీ విజయం సాధించడంతో..తర్వాత వస్తున్న ‘బిజినెస్ మేన్’ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన బిజినెస్ మేన్ ఆడియోకి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ మనసును గాయ పరిచే న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది.

బిజినెస్ మేన్ సినిమాలోని ‘PILLA CHAO’ అనే సాంగగ్ ట్యూన్స్...ఓ ఇటాలియన్ ఫోక్ సాంగ్ నుంచి కాపీ కొట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఓ వీడియో కూడా యూట్యూబ్ లో దర్శనం ఇస్తోంది. మరి దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.The Business Man

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బిజినెస్ మేన్ ముంబై మాఫియా, ఆయుధాల వ్యాపారం నేపథ్యంలో సాగుతుంది. మహేష్ బాబు సరసన కాజల్ రొమాన్స్ చేస్తోంది. ఆర్ఆర్ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మహేష్ సినిమానుంచి సమంత ఔట్ !?

మహేష్ బాబు, దిల్ రాజు కాంబినేషన్ లో రూపొందుతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలోంచి సమంతను తీసేస్తున్నారని టాక్. మహేష్,సమంత కాంబినేషన్ లో వచ్చిన దూకుడు సూపర్ హిట్ కావటంతో ఈ జంటను రిపీట్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆమె ఇప్పుడు డేట్ల సమస్యలో కూరుకుపోయింది. ఆమెపై రీసెంట్ గా బెల్లంకొండ సురేష్ సైతం నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేసారు. నందినీరెడ్డి దర్సకత్వంలో రూపొందే చిత్రం కోసం ఆమె డేట్స్ తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ సరసన ఎవడు లోనూ,గౌతమ్ మీనన్ ట్రైలిగ్వువల్ చిత్రంలోనూ,నాగచైతన్య ఆటోనగర్ సూర్యలోనూ బిజీగా ఉంది.
దాంతో ఆమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ కుSamantha హాజరుకాలేకపోవటంతో షూటింగ్ వాయిదా వేసుకున్నారు. ఓ ప్రక్క చిత్రంలో మరో హీరోగా చేస్తున్న వెంకటేష్ సరసన చేసే వారు దొరకక తలపట్టుకు కూర్చున్న నేపద్యంలో సమంత డేట్స్ సమస్యను కూడా ఫేస్ చేయటం కష్టమనిపించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని అడ్డాల శ్రీకాంత్ డైరక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో వెంకటేష్,మహేష్ అన్నదమ్ములుగా కనిపించనున్నారు. వారి తల్లి తండ్రులుగా జయసుధ,ప్రకాష్ రాజ్ అలరిస్తారు

సీబీఐ వేధిస్తోంది: కోనేరు ప్రసాద్






సీబీఐ వేధిస్తోంది: కోనేరు ప్రసాద్

హైదరాబాద్ : సీబీఐ తనను వేధిస్తోందని ఎమ్మార్ కేసులో ప్రధాన నిందితుడు కోనేరు ప్రసాద్ ఆరోపించారు. చంచలగూడ జైల్లో ఉన్న ఆయనను గురువారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది.

కోనేరు ప్రసాద్ ఈ సందర్భంగా తన కుటుంబాన్ని, వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని సీబీఐ వేధిస్తోందని న్యాయమూర్తికి విన్నవించారు. కాగా ఆయన రిమాండ్ ను న్యాయస్థానం జనవరి 12వ తేదీ వరకూ పొడిగించింది.

జగన్ వర్గం ఎంపీకి, కోమటిరెడ్డికి కాంగ్రెసు నోటీసులు


Komatireddy Venkat Reddy-Mekapati Rajagopal Reddy

న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం బుధవారం నోటీసులు జారీ చేసింది. లోక్‌పాల్‌కు ఎన్నికల కమిషన్‌లాగా రాజ్యాంగ బద్ధత కల్పించాలన్న ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ప్రతిపాదనకు లోకసభలో ఓటింగ్ జరుగుతున్న సమయంలో సుమారు ఇరవై ఐదు మంది ఎంపీలు గైర్హాజరైన విషయం తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధిష్టానం ఎంపీలందరికీ నోటీసులు జారీ చేసింది.

అందులో మన రాష్ట్రానికి చెందిన మేకపాటి, కోమటిరెడ్డి ఉన్నారు. తన గైర్హాజరీపై కోమటిరెడ్డి ఇప్పటికే పవర్ కుమార్ బన్సాల్‌కు వివరణ ఇచ్చుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను హాజరుకాలేదని ఆయన చెప్పారు. ఇటీవల వారి కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక మేకపాటి తాను రాజీనామా చేశాక విప్ ఎలా వర్తిస్తుందని ప్రశ్నిస్తున్నారు
FRee Ads SenD UR Add : n.badri2@gmail.com





స్వగ్రామానికి బయలుదేరిన అన్నా హజారే



ముంబై: ఆరోగ్యం క్షీణించడంతో దీక్ష విరమించిన అన్నాహజారే స్వగ్రామం రాలేగావ్ సిద్ధికి బయలుదేరి వెళ్లారు. దీక్ష విరమించిన అనంతరం హజారే బాంద్రాలోని మహారాష్ర్ట ప్రభుత్వ గెస్ట్‌హౌజ్‌లో విశ్రాంతి తీసుకున్న ఆయన గురువారం ఉదయం స్వగ్రామానికి బయలుదేరి వెళ్లారని అన్నా అనుచరుడు దత్తా తివారీ తెలిపారు.

అర్ధాంతరంగా హజారే దీక్ష విరమించడం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆరోగ్యం పరిస్థితి క్షీణించడం, ప్రజా స్పందన లేకపోవడంతో అన్నా ఒకరోజు ముందుగానే దీక్ష విరమించారు.

Click Here! నెల్లూరు జిల్లాలో థానే ప్రతాపం




నెల్లూరు: జిల్లాలో థానే ప్రతాపం చూపుతోంది. సముద్ర భీకర రూపం దాల్చినట్టు సమాచారం. సూళ్లురు పేట, వాకాడు, తడ, పిట్టమూరు మండలాల్లో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. కుండపోతగా వర్షం కూడా ప్రారంభమైనట్టు తెలిసింది. ఉదయంతో పోలిస్తే .. గాలుల తీవ్రత పెరిగింది. సముద్ర తీరంలో 15 అడుగుల మేరకు అలలు ఎగిసి పడుతున్నాయి. లక్ష్మిపుర ం సమీపంలో ఒక బోటు గల్లంతైంది. దాంట్లో నలుగురు మత్స్యకారులు ఉన్నట్టు సమాచారం. కృష్ణపట్నం పోర్టు నుంచి మెరైన్ బోటు వీరిని రక్షించడానికి బయలుదేరింది.

తెలంగాణలో చంద్రబాబుకు లేనిది జగన్‌కా?: మేకపాటి

హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించగా తమ అధినేత, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందేమిటని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గురువారం అన్నారు. గుంటూరులో యాత్ర
Mekapati Rajamohan Reddy
పూర్తి కాగానే తెలంగాణలో త్వరలో జగన్ ఓదార్పు యాత్ర చేపట్టనున్నారన్నారు. జగన్ పర్యటన కోసం తెలంగాణ ప్రజలు ఆతృతతో ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో తెలంగాణలో మాకు మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, టిడిపిలకు దిమ్మ తిరిగేలా ఫలితాలు ఉంటాయన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ తొలగించి రాజీవ్ యువకిరణాలు పెట్టారన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందన్నారు. డిసెంబర్ నెలాఖరులోగా లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న సిఎం ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ పథకానికి సంబంధించి మూడువేల కోట్ల బకాయిలు ఉంటే కేవలం ఐదువందల కోట్లే ఇచ్చారన్నారు. జనవరి నాలుగో తేదిన ఒంగోలులో ఫీజు పోరు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టరును వారు విడుదల చేశారు.