మంజులారామస్వామి టీమ్ చేసిన క్లాసికల్ డాన్స్, దేవిశ్రీప్రసాద్ ఆటా పాటా, అనిరుధ్ పాడిన ‘కొలవెరి...’ పాట, శ్రీకృష్ణ-సునీతలు పాడిన వేటూరి క్లాసిక్స్, గీతామాధురి, ప్రణవి, శ్రీకృష్ణ, మాళవికలు పాడిన సిరివెన్నెల పాటలు ఆహూతులను ఆకట్టుకోగా, ఛార్మి డాన్స్, ‘డియాలో డియాలో...’ పాటకు మరియమ్ జకారియా వేసిన స్టెప్పులు హుషారు పెంచాయి.
‘సార్ వస్తారొస్తారా...’ అంటూ స్వాతి ఆలపించిన పాట ప్రత్యేక ఆకర్షణ అయ్యింది. బాబా సెహగల్ తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇలా ఈ అవార్డుల వేడుక రసవత్తరంగా సాగింది. ఈ వేదికపై ‘శ్రీరామరాజ్యం’ యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా సత్కరించారు. నందమూరి బాలకృష్ణ, నయనతార, బాపు, యలమంచిలి సాయిబాబు,
మ్యూజికల్ ఫిలిం ఆఫ్ ది ఇయర్‌కి గాను ‘దూకుడు’ నిర్మాతలు, డాన్స్ నంబర్ కొరియోగ్రాఫర్‌గా ప్రేమ్ రక్షిత్, బెస్ట్ సింగింగ్ సెన్సేషన్‌గా స్వాతి, బెస్ట్ ఇన్‌స్పిరేషన్ సాంగ్ రచయితగా సుద్దాల అశోక్‌తేజ అవార్డులు స్వీకరించారు. ఈ వేడుకలో కె.విశ్వనాథ్, అల్లు అరవింద్, కె.అచ్చిరెడ్డి, గుణ్ణం గంగరాజు, ఎస్వీ కృష్ణారెడ్డి, నందినీరెడ్డి, మణిశర్మ, చంద్రబోస్, అమల, సుమంత్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, నాగచైతన్య, వరుణ్ సందేశ్, పుల్లెల గోపిచంద్ తదితరులు కూడా పాల్గొన్నారు. ‘మా గోల్డ్’ చానల్‌ను ఇదే వేదికపై ప్రారంభించారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls