25, జనవరి 2012, బుధవారం

విశ్వరూపం తరువాత అమర్ హై

విశ్వరూపం చిత్రం తరువాత అమర్‌హై అంటున్నారు కమలహాసన్. భారతదేశం గర్వించదగ్గ నటులలో ముందుండే నటుడు కమల్. ఈ సకల కళా వల్లభు డు ప్రస్తుతం విశ్వరూపం చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తమిళచిత్ర పరిశ్రమలో ఇంతవరకు ఏ చిత్రం రూపొందని విధంగా వందకోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం విశ్వరూపం. 

ఈ చిత్రం క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకరణ మినహా మొత్తం చిత్రం పూర్తి అయ్యిందని కమల్ వెల్లడించారు. తన తదుపరి చిత్రం కోసం కూడా ఆయన సిద్ధం అవుతున్నారు. ఈసారి కమల్ అవినీతిపై పోరాటానికి సన్నద్ధం అవుతున్నారు. తమిళం, హిందీ భాషల్లో రూపొందించనున్న ఈ చిత్రానికి అమర్‌హై అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్ర స్క్రిప్టును ఆయన రెండేళ్ల క్రితమే తయారు చేశారట. 

ఆర్థికపరమైన కొన్ని కారణాల వల్ల అప్పట్లో ఈ కథను తెరకెక్కించే ప్రయత్నం చేయలేదని, ఇప్పుడు సరైన సమయంగా భావిస్తున్నట్టు కమల్ పేర్కొన్నారు. విశ్వరూపం హిందీ వెర్షన్‌కు సంభాషణలు సమకూర్చిన అతుల్ తివారినే ఈ అమర్‌హై చిత్రానికి మాటలు రాస్తున్నారని తెలిపారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls