25, జనవరి 2012, బుధవారం

గుడ్ న్యూస్..: జనవరి 30న కొత్త బజాజ్ పల్సర్ విడుదల


New 2012 Pulsar
పల్సర్ ప్రియులను ఎప్పటి నుండో ఊరిస్తున్న సరికొత్త "బజాజ్ పల్సర్" విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల (జనవరి) 30వ తేదీన తమ సరికొత్త పల్సర్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నామని బజాజ్ ఆటో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ తెలిపారు. మంగళ వారం తమ కెటిఎమ్ డ్యూక్ 200 బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా రాజీవ్ బజాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బజాజ్ పల్సర్‌కు, తాము కొత్తగా విడుదల చేయనున్న పల్సర్‌కు దాదాపు ఎలాంటి పోలికలు ఉండవని, దీనిని సరికొత్త ఫ్లాట్‌ఫామ్‌పై రూపొందించామని, ఇందులో ప్రస్తుతం ఉపయోగిస్తున్న డిటిఎస్-ఐ టెక్నాలజీ కన్నా మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించామని కంపెనీ పేర్కొంది.

ఇది కేవలం బజాజ్‌కు మాత్రమే తర్వాతి స్థాయి (నెక్స్ట్ లెవల్) కాదు, భారత్‌లోని మోటార్‌సైకిల్ సెగ్మెంట్లోనే ఇది తర్వాతి స్థాయిగా నిలువనుంది. తొలుత ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త పల్సర్‌లో ఉపయోగించనున్నామని, ఆ తర్వాతి కాలంలో డిస్కవర్‌ బ్రాండ్‌లో కూడా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తామని రాజీవ్ బజాజ్ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇవి రెండూ కూడా బజాజ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న బ్రాండ్‌లు. రాజీవ్ బజాజ్ వ్యాఖ్యల ప్రకారం, కొత్త పల్సర్‌లో ఉపయోగించనున్న ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలోనే మరెక్కడా లేదుట. మరి కొత్త పల్సర్ బైక్ లవర్స్‌ను ఆకట్టుకుంటుందులో లేక ఆర్ఈ60 ఫోర్-వీలర్ మాదిరిగా నిరుత్సాహపరుస్తుందో.. వేచి చూడాల్సిందే..! మీరేమంటారు..?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls