25, జనవరి 2012, బుధవారం

స్పెషల్ ఎడిషన్ బుగాటి వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్ విడుదల

ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు పెట్టే కార్లను తయారు చేసే, ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బుగాటి అందిస్తున్న "వేరాన్" మోడల్‌లో మరో సరికొత్త వెర్షన్‌ను దోహాలో జరుగుతున్న ఖతార్‌ మోటార్‌ షోలో ఆవిష్కరించింది. 2.05 మిలియన్ అమెరికన్ డాలర్ల ధర (పన్నులు, డెలివరీ చార్జీలు కలపకుండా) కలిగిన ఈ "స్పెషల్ ఎడిషన్ బుగాటి వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్"ను బుగాటి ఖాతర్‌లో విడుదల చేసింది.Special Edition Bugatti Veyron 16.4 Grand Sport

వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్‌ స్టాండర్డ్ వేరియంట్ ధర 1.82 మిలియన్ అమెరికన్ డాలర్ల ధర (పన్నులు, డెలివరీ చార్జీలు కలపకుండా)గా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు తీసే ఓపెన్ టాప్ కారు. సరికొత్త స్పెషల్ ఎడిషన్ బుగాటి వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్‌ను పూర్తిగా పసుపు, నలుపు రంగుల కలయికతో పెయింటింగ్ చేయబడి, ఇంటీరియర్స్‌లో అధిక భాగం అదే రంగులను ఉపయోగించడం జరిగింది. స్పోర్టీ లుక్ కోసం ఈ రంగులను ఉపయోగించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls