29, జనవరి 2012, ఆదివారం

వేములవాడలో ఎద్దుల వీరంగం, కాణిపాకంలో వింతశబ్ధం


Vemulawada-Kanipakam,
కరీంనగర్/చిత్తూరు: కరీంనగర్ జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రంలో రెండు కోడె దూడలు ఆలయ ప్రధాన ద్వారం ఎదుట సోమవారం ఉదయం గంట సేపు వీరంగం సృష్టించాయి. వరంగల్ జిల్లాలో మేడారం జాతర ప్రారంభం కావడంతో వేములవాడకు కూడా భారీగా భక్తులు తరలి వచ్చారు. ఏడు గంటల సమయంలో రెండు కోడె దూడలు ఎదురు పడి కుమ్ముకున్నాయి. భక్తులు, పోలీసులు వాటిని అదుపులోకి తీసుకు రావడానికి ఎంతగా ప్రయత్నించినా కుదరలేదు. దాదాపు గంట సేపటి తర్వాత పోలీసులు వాటిని అదుపులోకీ తీసుకొని అక్కడే ఉన్న మండపంలో కట్టి వేశారు. అవి పోటా పోటీగా కుమ్ముకోవడంతో భక్తులు భయంతో అక్కడి నుండి పారిపోయారు. నాలుగు దుకాణాలు, ఒక ద్విచక్ర వాహనం ధ్వంసమయ్యాయి. ఈ సమయంలో కొద్దిగా తొక్కిసలాట జరిగింది. సుమారు పది మంది భక్తులకు గాయాలయ్యాయి.

మరోవైపు కాణిపాకంలో ఓ వింత శబ్ధం భక్తులను ఆందోళనకు గురి చేసింది. కాణిపాకం పుణ్యక్షేత్రంలోని ఓ హుండీ నుండి ఉదయం వింత శబ్ధం వచ్చింది. ఎక్కడైనా బాంబు ఉందేమోనని అందరూ ఆందోళన పడ్డారు. అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. చిత్తూరు నుండి బాంబ్ స్క్వాడ్‌ను రప్పించారు. అయితే హుండీలో ఉన్న ఓ ఇంపోర్టెడ్ వాచ్ వల్ల ఈ శబ్ధం వస్తున్నట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls