25, జనవరి 2012, బుధవారం

జర్నీపై శ్రీను వైట్ల కామెంట్స్

శర్వానంద్ ప్రధాన పాత్రలో మురుగదాస్ నిర్మించిన తమిళ డబ్బింగ్ సినిమా జర్నీ సూపర్ హిట్ టాక్ తో దూసుకెలుతోంది. ఈ సినిమా గురించి దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ....‘చాలా రేర్‌గా వచ్చే సినిమా ఇది. ప్రేక్షకులపై ఎంతో ప్రభావం కలిగించేలా దర్శకుడు శరవణన్‌ ఈ చిత్రాన్ని మెచూరిటీతో ఎంతో సహజంగా రూపొందించారు అని చెప్పుకొచ్చారు. గోపాల్‌ మాట్లాడుతూ ‘జర్నీ’ స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్‌ సన్నివేశం కంటతడిపెట్టిస్తుంది’ అన్నారు. 3కెSrinu Vytla ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో ఎస్‌.కె.పిక్చర్స్‌ బ్యానర్‌పై సురేష్‌ కొండేటి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు.

ఇక పోతే....మంచి ఎమోషనల్ జర్నీగా సాగే ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల నుంచి మంచి పాజిటివ్ రిపోర్ట్ రావటంతో డిస్ట్ర్రిబ్యూటర్స్,ఎగ్జిబిటర్స్ మంచి హ్యాపీగా ఉన్నారు. ఇక శర్వానంద్ సైతం తెలుగులో చాలా గ్యాప్ తర్వాత హిట్ రావటంతో చాలా సంతోషంగా ఉన్నాడు. గమ్యం తర్వాత శర్వానంద్ కు లభించిన మరో హిట్ ఈ చిత్రం.

శ్రీను వైట్ల ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసే పనిలో బిజిగా ఉన్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఇటీవల దూకుడు సినిమాతో భారీ విజయం తన ఖాతాలో వేసుకున్న శ్రీను వైట్ల జూనియర్ మరోసారి ఇండస్ట్రీకి మంచి హిట్ ఇవ్వాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ బోయపాటి దర్శకత్వంలో దమ్ము సినిమాలో నటిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls