ఏలూరు: హీరో నందమూరి బాలకృష్ణ ఉప ఎన్నికల్లో పోటీ చేయరని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ఆయన ఓటర్ల నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో బాలయ్య పోటీ చేయరన్నారు. 2014 ఎన్నికలే తెలుగుదేశం పార్టీ లక్ష్యమన్నారు. ఆయన ఎక్కడి నుండి పోటీ చేయాలో ఎప్పుడు పోటీ చేయాలో పార్టీ నిర్ణయిస్తుందన్నారు. ప్ర
స్తుతం బాలయ్య సినిమాల్లో నటిస్తున్నారని త్వరలో ఆయన భవిష్యత్తు పార్టీలో నిర్ణయిస్తామన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవిలు వ్యక్తిగతంగా తనకు మంచి మిత్రులు అన్నారు. రాజకీయంగా మాత్రం వారితో విభేదిస్తానన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు స్థలం కేటాయించింది తానేనన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని అది సరికాదన్నారు. అన్ని కులాలకు సమ ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీయేనన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పోలవరం టెండర్ల కోసం కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారన్నారు. రాష్ట్రంలోని ప్రాణహిత - చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం పనులు నాసిరకంగా తయారవుతున్నాయని ఆరోపించారు. దానిని త్వరగా పూర్తి చేయాలన్నారు. కేంద్రంలో వామపక్షాలతో సత్సంబంధాలు ఉన్నాయని, ప్రస్తుతానికి మహాకూటమి ఆలోచన లేదన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls