జర్నీ సినిమాలో అమాయకంగా నటించి అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ అనన్య రియల్ లైఫ్‌లో భార్య పోస్టులోకి వెళ్ల బోతోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2న అనన్య ఎంగేజ్ మెంట్ ఫిక్స్ అయింది. అంజనేయన్ అనే బిజినెస్ మేన్ ఈ మలయాళ కుట్టి భర్త కాబోతున్నాడు.
అంజనేయన్ అనన్యకు వీరాభిమాని. ఆమె సినిమా షూటింగులు జరుగుతుండగా తరచూ వెళ్లి చూసే వాడు. ఈ క్రమంలో ఆమెపై మనసు పారేసుకుని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఒకసారి సెట్ లోనే పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకారం తెలపడంతో వ్యవహారం ఎంగేజ్ మెంట్ వరకు వచ్చింది. నిశ్చితార్థం తర్వాత పెళ్లి తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.
మలయాళంలో పాపులర్ హీరోయిన్ అయిన అనన్య ప్రస్తుతం రెండు మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. అనన్య నటించిన ‘జర్నీ’ చిత్రం ఇటీవల తమిళం, తెలుగు భాషల్లో విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా శరవనణ్ దర్శకత్వం వహించారు.
Journey Success Meet
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls