25, జనవరి 2012, బుధవారం

పుట్టినరోజు సినిమాకెళ్లేవాణ్ణి

‘‘నాకు ఫస్ట్ నుంచి బర్త్‌డే జరుపుకునే అలవాటు లేదు. అనవసరంగా డబ్బులు ఖర్చు. సినిమా తప్ప చిన్నప్పట్నుంచీ నాకు మరో లోకం తెలీదు. అందుకే పుట్టినరోజు వస్తే సినిమాకు వెళ్లిపోయేవాడ్ని. అయినా ఏడాది ఆయుష్షు తరిగిపోతే బాధపడాలికానీ... వేడుకలేంటండీ బాబూ...’’ అన్నారు రవితేజ. నేడు(గురువారం) ఆయన పుట్టిన రోజు. 

ఈ సందర్భంగా బుధవారం విలేకరులతో ముచ్చటిస్తూ రవితేజ పై విధంగా స్పందించారు. తాజాగా తను నటిస్తున్న ‘నిప్పు’ సినిమా గురించి మాట్లాడుతూ -‘‘గుణశేఖర్ అభిరుచికి తగ్గట్టుగా, నా స్టైల్‌లో ఈ సినిమా ఉంటుంది. వైవీఎస్ నాకు ఫ్రెండ్‌గా ఇప్పటివరకూ తెలుసు. ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా చూశాను. కచ్ఛితంగా తనతో మరో సినిమా చేస్తాను’’ అన్నారు. 

తానూ సూర్య కలిసి నటించే సినిమా ఇంకా ఫైనలైజ్ కాలేదని, పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ఇప్పటికి నాలుగు సినిమాలు చేశానని, అయిదో సినిమా ‘దేవుడు చేసిన మనుషులు’ త్వరలోనే మొదలవుతుందని చెప్పారు. అలాగే శివ దర్శకత్వంలో బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న ‘దరువు’లో సరదాగా సాగే మాస్ కేరక్టర్ చేస్తున్నానని, ప్రస్తుతం ఫైనలైజ్ అయినవి ఈ రెండు సినిమాలేనని రవితేజ తెలిపారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls