రాజమౌళి వీడియో ఒకటి ఇప్పుడు యూ ట్యూబ్ లో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాజమౌళి ప్రారంభం రోజుల్లో ఓ యాడ్ కోసం నటించి చూపిన ఓ క్లిప్ అందరిని ఆకట్టుకుంటోంది. ఆయన మంచి దర్శకుడుగానే అందరికీ పరిచయమైనా ఆయనలోని ఓ మంచి నటుడు దాగి ఉన్నాడని ఈ క్లిప్ తెలుపుతోంది. ఆ క్లిప్ ఇదే.. http://www.youtube.com/watch?v=bork-yu1ZG8&feature=youtu.be ఇక ప్రస్తుతం రాజమౌళి ఈగ తుది మెరుగులు దిద్టటంలో బిజీగా ఉన్నారు. నాని,సమంత కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ఓ విజువల్ వండర్ గా చెప్తున్నారు. రీసెంట్ గా ఆ చిత్రానికి చెందిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఇక ఈగ గురించి ఆయన చెపుతూ..సినిమా ప్రారంభమైన తొలి అరగంటలోనే హీరో చనిపోతాడు. అతని ఆత్మ... ఓ 'ఈగ'లో వాలుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలు. చిన్న ఈగ బలవంతుణ్ని ఎలా ఎదుర్కొంది? అసలు ఈగ పగకు కారణం ఏమిటి? ఈ విషయాలన్నీ ఆసక్తికరం.
వినోదం, ఉత్కంఠత మేళవించి చూపిస్తున్నాం. ఇందులో హృద్యమైన ప్రేమ కథ ఉంది. విజువల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన కార్యక్రమాలు నడుస్తున్నాయి. మూడు పాటలున్నాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. అలాగే ...బలవంతుడైన ప్రతినాయకుడిని ఎదుర్కోవాలంటే కథానాయకుడికి కనీసం ఆరు పలకల దేహం ఉండాలి. రెండు చేతుల్లో అధునాతన ఆయుధాలుండాలి. ఎత్తుకు పైఎత్తులు వేసేంత తెలివితేటలు కావాలి. ఇన్ని ఉన్నా... ప్రతినాయకుడిని పడగొట్టాలంటే పతాక సన్నివేశాల వరకూ ఆగాలి. ఇవేమీ లేకుండానే చిన్న కీటకం.. ఓ బలవంతుడి కొమ్ములు విరిచింది. అదెలాగో తెలియాలంటే మా 'ఈగ' సినిమా చూడాల్సిందే అంటున్నారు. ఇక 'ఈగ'లో నాని, సమంత జంటగా నటిస్తున్నారు. కన్నడ నటుడు సుదీప్ కీలక పాత్రధారి. కొర్రపాటి సాయి నిర్మాత. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేస్తారు.ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్, సంగీతం: కీరవాణి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls